– హాజరైన సభ్యుడు బీఎస్ఆర్
శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులుగా నియామకం తర్వాత శ్రీశైలంలో తొలిసారిగా బోర్డు మీటింగ్ శుక్రవారం జరిగింది. సమావేశానికి ముందు దేవస్థానం మండపంలో బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు(బీఎస్ఆర్)తో పాటు ఇతర సభ్యులకు ఆలయ పూజారులచే ఆశీర్వచనంతో పాటు స్వామి వారి ప్రతిమను ఆలయ ఈవో శ్రీనివాసరావు అందజేశారు. అనంతరం బోర్డు మీటింగ్ లో ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయ అభివృద్ధి, కార్తీక మాసంలో వచ్చే భక్తుల సౌకర్యాలపై సుదీర్ఘంగా చర్చించారు.