కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలలో విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబంలో 4 మరణించారు. అందులో ఇద్దరు గోళ్ళ రమేష్ మరియు గుత్త అనూష తెలుగుదేశం పార్టీ ( కుటుంబ సభ్యులుగా ఉన్నారు.
ఈ బాధాకరమైన ఘటన జరిగిన వెంటనే, మృతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. మరణించిన ఇద్దరి క్లెయిమ్‌లను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ద్వారా కేవలం ఆరు గంటల్లోనే పరిష్కరించడం విశేషం.
సాధారణంగా ఇలాంటి క్లెయిమ్‌ల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే, ఈ కేసులో వేగంగా స్పందించి, నిబంధనల ప్రకారం క్లెయిమ్‌లను ఆమోదించడం జరిగింది. క్లెయిమ్స్ పరిష్కారంలో చూపిన ఈ అరుదైన వేగం అందరి దృష్టిని ఆకర్షించింది.
శనివారం, ఆదివారాలు బ్యాంక్ సెలవులు కావడంతో, మృతుల నామినీలకు పరిహార మొత్తం సోమవారం కల్లా వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ దుర్ఘటనపై టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన రమేష్ మరియు అనూష కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో పార్టీ వారికి అండగా ఉంటుందని మానవత్వం చాటారు.
ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా ప్రజలను కలచివేసింది. మృతుల కుటుంబాలకు తక్షణ భరోసా లభించడం కొంతవరకు ఊరటనిచ్చే విషయం.
