ఎమ్మెల్సీ కవిత కు మద్దతుగా ఫ్లెక్సీలు

– ఫైటర్ ఆఫ్ డాటర్ నెవర్ ఫియర్
– సేవ్ ఇండియా ఫ్రొం బిజెపి

వి ఆర్ విత్ కవితక్క అనే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను *బి ఆర్ ఎస్ పార్టీ నేత అలిశెట్టి అరవింద్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ తో పాటు పంజాగుట్ట, ఖైరతాబాద్ లలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దేశాన్ని పాలిస్తున్న బిజెపి వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తూ దేశం తిరోగమనంలో ప్రయాణిస్తున్న వేళ దేశాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించడంతోనే బిజెపి కక్షపూరిత చర్యలకు దిగిందని అలిశెట్టి మండిపడ్డారు. సంక్షేమ పథకాలలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర పూరిత రాజకీయాలకు తెర లేపారని మండిపడ్డారు. దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ధర్మ యుద్ధంలో బీఆర్ఎస్ దే తుది విజయమని అన్నారు.

Leave a Reply