Suryaa.co.in

Telangana

సూర్యాపేట పురపాలికకు నిధుల వరద

-30 కోట్లు విడుదల చేస్తూ తాజా ఉత్తర్వులు
-మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి
-అంతర్గత రహదారులు,డ్రైనేజీలు, బ్రడ్జిలతో పాటు పార్కుల ఏర్పాటుకై
-ఇప్పటి వరకు విడుదలైన నిధులు 1390 కోట్లు
-పట్టణ ప్రగతి పై మంత్రి జగదీష్ రెడ్డి మార్క్

సూర్యాపేట పురపాలికకు నిధుల వరద పారుతోంది. తాజాగా 30 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు 1390 కోట్లతో పట్టణాభివృద్ధి చేపట్టిన సూర్యాపేట పురపాలికకు తాజాగా పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకై 30 కోట్లు విడుదల చేయించిన స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పట్టణాభివృద్ధి పై తనదైన మార్క్ వేసుకున్నారు.

తాజాగా విడుదలైన నిధులతో పట్టణంలోనీ అంతర్గత రహదారులు, మారుమూల ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణాలు,కల్వర్టులతో పాటు బ్రడ్జిల నిర్మాణాలు ,పార్క్ ల ఏర్పాట్లకై వ్యయం చేయనున్నారు. కాగా సూర్యపేట పెట్టనా సుందరీకరణతో పాటు పట్టణాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సరించడమే కాకుండా మున్సిపాలిటీ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో నిధులు మంజూరు చేయించడం మంత్రి జగదీష్ రెడ్డికే చెల్లిందని మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సూర్యపేట పురపాలికకు తాజాగా 30 కోట్లు మంజూరు చేయించినందుకు గాను మంత్రి జగదీష్ రెడ్డికి మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్,పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారకరామారావు లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE