అమరావతి:- ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి దశ దిన ఖర్మ సందర్భంగా అన్న క్యాంటీన్లలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నిర్వహిస్తున్న ఈ అన్న క్యాంటీన్ లలో ఉమామహేశ్వరి దశదిన ఖర్మ సందర్భంగా అన్నదానం కార్యక్రమం జరిగింది. ఉమా మహేశ్వరి సోదరి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచనల మేరకు ఎపిలో ఉమామహేశ్వరి పేరున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో 14 అన్న క్యాంటీన్ లలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాదాపు 10 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని స్థానిక నాయకులు ఉమామహేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమామహేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని నేతలు ప్రార్థించారు.