Suryaa.co.in

Food & Health

ఆరోగ్యం కోసం..ఇలా చేయండి

చాలా మందికి నోటికి రుచిగా ఉంటే తప్ప ముద్ద దిగదు. అలా నోటికి రుచిగా నచ్చిన ఆహారం తినటంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త శ్రద్ధ వహించాలి.
ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్‌ ‘సి’, ‘ఎ’, ‘కె’ లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అధికంగా ఉంటాయి.అలాగే ఐరన్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి.
క్యాలీ ఫ్లవర్‌లో ఎక్కువగా మినరల్స్‌, విటమిన్స్‌, న్యూట్రీన్స్‌, యాంటీ ఆక్సిడెంట్‌లతో పాటు క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుంది. అలాగే కిడ్ని ల పని తీరును మెరుగు పరచటంతో పాటు అధిక రక్త పోటును అదుపులో ఉంచుతుంది.
క్యాలీ ఫ్లవర్‌లో ముఖ్యంగా విటమిన్‌ ‘సి’, ‘కె’, ప్రోటీన్లు, మెగ్నిషియం, పొటాషియం, పాస్పరస్‌, మాంగనీస్‌ వంటి పోషకాలు చాలా ఉంటాయి.
అధిక రక్త పోటును అదుపులో ఉంచటంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ బాగా పని చేస్తుంది. అలాగే రక్త కణాలను పెంచటంలో బీట్‌రూట్‌ పాత్ర కీలకం. బీట్‌రూట్‌లో ఉండే కణాలు ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
బాదం, బీన్స్‌, శనగలు, చిక్కుడు వంటి గింజల్లో ప్రోటీన్స్‌, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించటంలో ప్రాముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే వీటిలో కొలెస్ట్రాల్‌ చాలా తక్కువగా ఉంటుంది.
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ మరియు మంచి నీరు వీలైనంత ఎక్కువగా తీసుకోండి (అంటే రోజూ తినే ఆహారంలో 40% ఉండేలా చూసుకోండి).
చూడగానే నోరూరించేలా, కళ్ళకు అందంగా కనపడేలా, నోటికి రుచిగా ఉండేలా మైదాతో తయారు చేసిన పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, స్వీట్లు, కూల్ డ్రింక్స్, ఐస్క్రీమ్స్ వంటివి వారానికో లేదా నెలకు ఒక్కసారి మాత్రమే తీసుకోండి, ఆరోగ్యంగా జీవించండి.
అన్నింటికీ ప్రణాళికలు వేసుకుని మరీ ఖర్చు చేస్తారు. ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అనారోగ్యం పాలయ్యేవరకు శరీరం గురించి ఆలోచించరు.
మీ శరీర భాద్యత మీదే, ఎందుకంటే మీ శరీరం ఉన్నంత వరకే మీరు జీవించి ఉండగలరు కాబట్టి.

ఏర్వ వెంకటేశం, న్యూట్రిషన్ హెల్త్ కోచ్.
8374910270

LEAVE A RESPONSE