Home » భగత్ సింగ్ ..భగవద్గీత

భగత్ సింగ్ ..భగవద్గీత

భగత్ సింగ్ పట్టుబడ్డాక అతడిని జైలులో వేశారు బ్రిటీషు బ్రీడు వారు. జైలులో గడిపినన్ని రోజులు ఆయన ఉదయం వ్యాయామం చేసేవాడు. తెల్లవారుజామున చలికి సైతం వణకకుండా వ్యాయామం చేసేవాడు.అది చూసి తెల్ల తోలు వారు ఆశ్చర్యపోయేవారు.
మిగతా ఖాళీ సమయంలో భగవద్గీత చదివేవాడు.
రోజు కొంత భాగం భగవద్గీత చదివాక,ఎంత వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి అక్కడి బ్రిటీషు కాపలాదారునికి ఇచ్చేవాడట!
అలా కొన్ని రోజుల తరువాత భగత్ సింగ్ ని ఉరి తీసే రోజు రానే వచ్చింది.ఉరి తీసే కొన్ని గంటల ముందు రోజూ లాగే భగవద్గీత చదివి,ఎక్కడి వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి ఆ కాపలాదారునికి ఇచ్చాడు.
అది చూసిన ఆ తెల్ల కాపలాదారుడు ఆశ్చర్యంతో…
“అదేంటి? నువ్వు బతికున్నన్ని రోజులు ఈ పుస్తకం ఎంత వరకు చదివావో, అక్కడ పేజీని మడతేసి నాకు ఇచ్చావు సరే!కాని ఇప్పుడు నిన్ను మా ప్రభుత్వం ఉరి తీస్తుంది! ఇంకా పేజీని మడతేసి ఇవ్వడం దేనికి?”అని ఉత్సుకత తో అడిగాడు!
భగత్ సింగ్ మాత్రం ఎలాంటి భయం,ఆంధోళన లేకుండా స్థిత ప్రఙతతో…
” ఇది మాములు పుస్తకం కాదు! మనిషికి కావాల్సిన నిజమైన సంపద,ఏ దేశం వాడు దోచుకుపోలేని ఙ్ఞాన బంఢారం అంతా ఇందులోనే ఉంది!మీ ప్రభుత్వం ఈ శరీరానికి శిక్ష వేసింది!కాని నా ధర్మం ప్రకారం నేను చేసింది నేరం కాదు!ఎవరు నమ్మినా,నమ్మకున్నా ప్రతీ ఒక్కరిపైనా కర్మ బలంగా పని చేస్తుంది!ఒకవేళ మీరు నాకు ఉరి వేసాక ఈ శరీరాన్ని నేను విడవచ్చు కాని నా ఈ జన్మ సంస్కారం నన్ను వదిలిపోదు!నేను ఎక్కడైతే చదవడం ఆపేసానో ,ఖచ్చితంగా మరో జన్మలో నేను చదవడం ఆపిన దగ్గరి నుండి మళ్ళీ చదువుతాను!అలా ఏదో ఒక జన్మలో పూర్తి యోగ సాధనలో పరమాత్ముడిని చేరుకుంటాను!” అని ధైర్యంగా సమాధానమిచ్చాడు”
ఈ సమాధానం విన్న ఆ కాపలాదారుడు భగత్ సింగ్ భగవద్గీతపై ఉంచిన నమ్మకానికి మరింతగా ఆశ్చర్యపోయాడు!
చంద్ర శేఖర్ ఆజాద్ దృడమైన శరీరం గలవారు, వారిని ఎక్కువగా చలి తీవ్రత ఉన్న ప్రాంతాల్లో ఖైదీగా ఉంచారు. ఆ చలికి ఉబ్బసం వ్యాధి వచ్చే సూచనలు ఉండుట వలన, అతడు జైలు ఖైదీ ఉచకోతలతో ఆలా గంటల సేపు వ్యాయామం చేయడం వలన, ఉష్ణోగ్రత వేడిమి వలన అతడు దృఢమైన శరీర సౌష్టవం వచ్చింది, వారు శిక్ష వేసిన న్యాయ మూర్తి కి కృతజ్ఞతలు తెలిపారు. భగత్ సింగ్ కాదు. ఆతడే చంద్ర శేఖర్ ఆజాద్

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

Leave a Reply