Suryaa.co.in

Andhra Pradesh Telangana

బహుజనులకు రాజ్యాధికారాన్ని పంచేందుకు కాంగ్రెస్ సిద్ధం

– అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సమన్వయ కర్త కొప్పుల రాజు

కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానంలో ప్రస్ఫుటమైన మార్పును ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అఖిల భారత ఎస్సీ ఎస్టీ సమన్వయ కర్త కొప్పుల రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బహుజనులకు రాజ్యాధికారాన్ని పంచేందుకు సిద్ధంగా ఉందన్న స్పష్టమైన సందేశాన్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చారని స్పష్టం చేశారు. రాజ్యాధికారం ద్వారా అధికారంలో సైతం భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఉందన్నారు. బహుజన శకం మొదలైందని, అన్ని వర్గాల నాయకులు కలిసి పని చేయాలని కోరారు.

రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆర్ ఎస్ ఎస్ ను ఏర్పాటు చేశారన్నారు కొప్పుల రాజు. దేశంలో కులాల మధ్య అసమానతలు పెరగాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని తగుల బెట్టారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం: ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి తప్పకుడా పూర్వ వైభవం వస్తుందని, ఈ రెండేళ్లు అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు శ్రమించాలి ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. ప్రాంతీయ పార్టీలు కొన్ని వర్గాలకే పరిమితమవుతున్నా యని, పార్టీ అధ్యక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అప్పగించేందుకు సిద్దమా? అని ప్రశ్నించారు.

అన్ని వర్గాల ప్రజలని కాంగ్రెస్ పార్టీ ఆదరించి ఉన్నత స్థానాల్లో నిల బెట్టిందని, కుల మత బేధాలు లేకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ను ఆదరించిన విషయాన్ని గుర్తు చేశారు. దళిత దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ ని స్పీకర్ చేసిన ఘనత దక్కిందన్నారు.

మనమంతా రాహుల్ గాంధీ సైనికులం: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్
ఈ ప్రజా వ్యతిరేక పార్టీలను వేటాడుతాం..వెంటాడుతా. అభివృద్ధికి అడ్డు వచ్చిన వారిని నిద్ర పోనివ్వం. నాయకత్వం అంతా కార్యకర్తలదే. కష్టాల్లో… నష్టాల్లో తోడుందేది మీరే. రాష్ట్రంలోని నలు మూలలనుంచి ముట్టడించబోతున్నాం. మనమంతా రాహుల్ గాంధీ సైనికులం. అభివృద్ధికి ఎవరు అడ్డమో.. ప్రజల ఆస్తులను దోచుకుంటున్న ఈ పార్టీలను వేటాడతాం… వెంటాడుతాం. కష్టాల్లో… నష్టాల్లో తోడు నీడగా ఉండేది కార్యకర్తలే. రాష్ట్రంలోని నలుమూలాల నుంచి ముట్టడించబోతున్నాం. దళితుల కోసం… మైనారిటీల కోసం… అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఈ పోరాటం… అధికారం కోసం కాదు రాష్ట్రంలో ఎవరికీ ఏ హక్కులు లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు పై నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో భూములు పంచాం… ఇళ్లు కట్టించాం… మన పథకాలను పేర్లు మార్చి కొత్తవి అంటున్నారు. ప్రజా ధనాన్ని దోచుకుంటున్న ఈ దుర్మార్గ మైన ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. జగన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గోటికి కూడా సరిపోరు.

LEAVE A RESPONSE