-జగన్,విజయసాయి కేసులు వివరించిన రామకృష్ణ
-ఇలాంటి నేరగాళ్లకు మద్దతుఇవ్వడమేమిటని ప్రశ్న
-ఖంగుతిన్న అఖిలేష్ యాదవ్
న్యూఢిల్లీ: గతంలో తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ జడ్జి రామకృష్ణ తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు.
ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మద్దతు పలికారు. అయితే, వైసీపీ నిరసన ప్రదర్శనలో పాల్గొని, తిరిగి వస్తున్న అఖిలేశ్ యాదవ్ ను మాజీ జడ్జి రామకృష్ణ అడ్డుకున్నారు.
అఖిలేశ్ వాహనాన్ని ఆపిన రామకృష్ణ… ఆయనకు జగన్, విజయసాయిపై ఉన్న కేసుల వివరాలను వినిపించారు. ఇలాంటి వ్యక్తులు తెలిపే నిరసనలకు మద్దతు ఇవ్వడం సబబు కాదని అన్నారు. గత ఐదేళ్లు ఏపీలో జగన్ విధ్వంసానికి పాల్పడ్డారని అఖిలేశ్ యాదవ్ కు వివరించారు.