Suryaa.co.in

Telangana

మనవరాలి పెళ్ళిలో… మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్ డ్యాన్స్

మల్కాజిగిరి: మాజీ మంత్రి మల్లారెడ్డి తన డాన్స్ తో మరోసారి అలరించారు. తన మనవరాలు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె సంగీత్ ఫంక్షన్ లో డీజే టిల్లు పాటకు ఆయన మాస్ స్టెప్స్ తో డాన్స్ ఇరగదీశారు. ప్రొఫెషనల్ డాన్సర్లతో కలిసి కాలు కదిపిన ఆయన పర్ఫార్మెన్స్ కు అందరూ విజిల్స్, అరుపులతో వేదికను హోరెత్తించారు. మొత్తంగా మల్లారెడ్డి మాస్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

LEAVE A RESPONSE