– పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం
– రానున్న రోజుల్లో ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు
– గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
– ఏపీకి గూగుల్ వస్తే గేమ్ ఛేంజర్ అవుతుంది
– అగ్రిటెక్, మెడ్‌టెక్ రంగాలపై బిల్ గేట్స్ తో చర్చించాం
– పెట్టుబడులకు నెట్వర్క్ చేయడానికి దావోస్ పర్యటన ఉపయోగపడింది
– వ్యవస్థలను విధ్వంసం చేసినవాళ్లు మాపై విమర్శలా?
– దావోస్ పర్యటన వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : విధ్వంసమైన ఏపీని గాడిలో పెడుతున్నాం. కేవలం 7 నెలల్లోనే ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం. దావోస్ పర్యటన విజయవంతమైంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయి. భవిష్యత్ లో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారుచేస్తాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటన వివరాలను సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాకు వివరించారు.
భారత్ నుంచి దావోస్ వెళ్లాలనే నిర్ణయం నాదే
దావోస్ నాకు కొత్త కాదు. ఈ దేశంలో మొదటిసారి దావోస్ కి వెళ్లాలని నిర్ణయించిందింది నేనే. 1995లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 1997 నుంచి దావోస్ క్రమం తప్పకుండా వెళ్లాను. 1991లో ఆర్థిక సంస్కరణలు రాగా 1995లో ఇంటర్నెట్ విప్లవం వచ్చింది. మొదట్లో దావోస్ కి వెళ్లేప్పుడు మాకు చాలా ఇబ్బందులు వచ్చేవి. హైదరాబాద్ అని చెప్తే…ఏ హైదరాబాద్..పాకిస్తాన్ లోదా అని అడిగేవారు. పెట్టుబడులు పెట్టమని అడిగితే …హైదరాబాద్ కి ఎలా రావాలని అడిగేవారు. అప్పట్లో అలా ఉండేది పరిస్థితి.
దావోస్ వచ్చేందుకు మన దేశ రాజకీయ నాయకులు పెద్దగా ఇష్టపడేవారు కాదు. దావోస్ అంటే డబ్బున్నవాణ్ణే సమావేశమవుతారు. మనం వెళితే రిచ్ గా భావించి ఓట్లు పడవని భయపడేవారు. నా తర్వాత కర్ణాటక నుంచి ఎస్ ఎం కృష్ణ వచ్చారు. నాకూ ఆయనకు పోటీ ఉండేది. ఆయన బెంగుళూరు గురించి, నేను హైదరాబాద్ గురించి ఎక్కువగా ప్రమోట్ చేసేవాళ్లం. హైదరాబాద్ లో ఏముందని ప్రశ్నించిన ఎస్ ఎం కృష్ణ ఆ తర్వాత…. ఏపీ సీఎం తో కలిసి పనిచేస్తానని స్వయంగా చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్ ప్రమోట్ చేశావు…ఇప్పుడు ఏపీకి ప్రమోట్ చేస్తున్నావు కదా అని మొన్నటి దావోస్ పర్యటనలో బిల్ గేట్స్ నన్ను అడిగారు.
నాడు ఐటీ – నేడు ఏఐ
నేను 4వ సారి సీఎం అయ్యాక ఏపీ బ్రాండ్ ను ప్రపంచమంతా ప్రమోట్ చేస్తున్నాను. పరిశ్రమలు స్థాపనకు, పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరిస్తున్నాను. దావోస్ పర్యటనలో 27 సమావేశాల్లో నేను పాల్గొన్నాను. 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు , 3 కాంగ్రెస్ సెషన్స్ కి హాజరయ్యారు. మంత్రులు లోకేష్, భరత్ …33 మీటింగ్స్ లో పాల్గొన్నారు. 5 రౌండ్ టేబుల్స్, 4 కాంగ్రెస్ సెషన్స్ కి లోకేష్ హాజరయ్యారు. ఒక యూన్ హ్యాబిటెడ్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ మీటింగ్ జరిగింది.
కాంగ్రెస్ సెషన్ లో ఎనర్జీ , ఏఐ గురించి చర్చించాము. మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులతో కలిసి అడ్రస్ చేశాను. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గురించి చర్చించాము. ఏపీని పెట్రో కెమికల్ హబ్ గా తయారుచేసే అంశంపై చర్చించాము. ఏపీకి విశాలమైన సముద్రతీరం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై దృష్టి పెట్టాం.
పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ
రాబోయే రోజుల్లో ఏపీకి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ సారి దావోస్ లో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, నేచర్ ఫామింగ్, ఏఐ, డీప్ టెక్ గురించే అందరూ మాట్లాడారు. ప్రపంచంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఒక చోట కలిసే కేంద్రం దావోస్. సివిల్ ఏవియేషన్ జ్యూరిక్, పెట్రోలియమ్ గ్యాస్ మలేషియన్ కంపెనీ, డీపీ వరల్డ్, ఏపీ మోలార్, మెరెస్క్, డెమెన్ హోల్డింగ్ బీవీ, గ్లోబల్ హెడ్, వాల్ మార్ట్ , పెప్సికో వంటి కంపెనీల ప్రతినిధులను కలిశాను. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించాను. అమరావతిలో పాటు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి ఉన్న అవకాశాలను వివరించాము.
రూ. 96 వేల కోట్ల పెట్టుబడితో రామాయపట్నంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతోంది. అనకాపల్లి దగ్గర రూ. 1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పటు కాబోతోంది. అలాగే రూ. 1.87 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతోంది. కాకినాడ కేంద్రం గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయబోతోన్నాము. గ్రీన్ ఎనర్జీలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నాము. సీఐఐ, ఐఎండీ సహకారంతో అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాము. సింగపూర్ లో బిజినెస్ స్కూల్ లో ఐఎండీ బెస్ట్ యూనివర్సిటీ . ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థలను వారే మన అమరావతికి తీసుకొస్తారు. న్యాచురల్ ఫామింగ్ లో ఏపీ దేశానికే నమూనాగా తయారుచేయాలని ప్రణాళిక సిద్ధం చేశాము.
ప్రధాని మోదీ నాయకత్వంలో బలమైన శక్తిగా భారత్
భవిష్యత్ లో మనదేశానికి ప్రపంచ వ్యాప్తంగా స్వర్ణయుగం రాబోతోంది. యువత మనకు అదనపు బలం. జీడీపీ వృద్ధిరేటులోనూ మన దేశం సుధీర్ఘ కాలం అగ్రస్థానంలో నిలవబోతోంది. ఆనాడు హైటెక్ సిటీని 14 నెలల్లో కట్టాము. నేటికీ ఐటీ అంటే హైటెక్ సిటీనే . సైబరాబాద్ నగరాన్నే నిర్మించాం. ఆనాడు మేము మీడియా సిటీ మొదలుపెడితే మీరు హైటెక్ సిటీ నిర్మించారని దుబాయ్ లో కొందరు పారిశ్రామిక వేత్తలు గుర్తుచేశారు. 1995 ఐటీ…2025లో ఏఐ అని నేను దావోస్ లో చెప్పాను. ఆనాడు నేను ప్రపంచమంతా తిరిగి ఐటీ గురించి చెప్పి హైదరాబాద్ కు కంపెనీలు తీసుకొచ్చాను.
హైస్కూళ్లు లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చాను. దీని వల్ల చదువుకున్న యువత వచ్చారు. అవకాశాలు వచ్చాయి. ఐటీలో శిక్షణ ఇస్తూనే ఇంగ్లీషులోనూ శిక్షణ ఇప్పించాము. ఉద్యోగం అడగటం కాదు…ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలని నేను ఆనాడు మన వాళ్లకు చెప్పాను. నేను జ్యూరిచ్ కి వెళ్లినప్పుడు 12 దేశాల నుంచి 600 మంది తెలుగువారు వచ్చారు. వారిలో 30 శాతం పారిశ్రామికవేత్తలే. అమెరికాలో ఎక్కువ తలసరి ఆదాయం మన తెలుగువారికే వస్తోంది.
అమెరికన్ల తలసరి ఆదాయం 60 వేల డాలర్లు కాగా మన వారిది లక్షా 20 వేల డాలర్లు. మన తెలుగు అమెరికాలో 12వ భాష. 100 దేశాల్లో తెలుగువారు ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో అన్ని దేశాల్లో మనవారే ఉంటారు. 2047నాటికి వెల్త్ లో మన దేశం అగ్రభాగంలో నిలవనుంది. అందులో 30 శాతం మన తెలుగువారే ఉంటారు. సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన వ్యక్తులుగా తయారుచేసేందుకు నేను ప్రయత్నిస్తున్నాను.
ప్రపంచానికి సేవలందించే హబ్ గా ఇండియా తయారుకాబోతోంది. విజయవాడలో కూర్చునే గ్లోబల్ స్థాయిలో పనిచేసే రోజులు రాబోతున్నాయి. నేను విదేశాల్లో ఉన్న మన తెలుగువారికి ఒకటే చెప్పాను. అక్కడే ఉండి పనిచేస్తూ స్వదేశానికీ సేవలు చేయాలని చెప్పాను. గ్రామాల్లో విప్లవం మొదలైంది. విదేశాల్లో ఉంటున్న పిల్లలు సొంతూరు వస్తే ఉండటానికి మంచి ఇళ్లు కడుతున్నారు.
విధ్వంసం నుంచి వికాశం వరకూ
ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని రూపుమాపి 7 నెలల్లో ఊహించని ప్రగతి సాధించాము. మన రాష్ట్రాన్ని పెట్రో హబ్ గా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాము. మ్యానిఫ్యాక్చరింగ్ లో గ్రీన్ ఎనర్జీ వినియోగం పెంచాల్సి ఉంది. ఏపీకి గూగుల్ వస్తే గేమ్ ఛేంజర్ అవుతుంది. దావోస్ లో గూగుల్ హెడ్ తో మాట్లాడాము. అలాగే టీసీఎస్ రాకతో విశాఖలో ఐటీ విప్లవం వస్తుంది. 10 వేలమందికి ఉద్యోగ, ఉపాధి లభించనుంది. కేంద్ర సహకారంతో రాష్ట్రం ముందుకెళ్తోంది. అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి.
2027 నాటికి పోలవరం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.. రైల్వే జోన్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 13,500 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చింది. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. 2025-26లో జీఎస్ డీపీ 15 శాతం వృద్ధి చెందితే రాష్ట్ర సంపద రూ. 18.47 లక్షల కోట్లకు చేరుతుంది. సామాన్యుల ఆదాయం పెంచి, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా ముందుకుపోతున్నాము. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదల అభివృధ్ధికి పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా పాలన అందిస్తున్నాము.
వ్యవస్థలను నాశనం చేసి మాపై విమర్శలా?
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఐదేళ్లలో రూ.1000 కోట్ల ప్రాజెక్టయినా తెచ్చారా అని నేను ప్రశ్నిస్తున్నాను. పెట్టుబడుల కోసం దావోస్ వెళితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యక్తి మీద కోపంతో ఒక వ్యవస్థను నాశనం చేయడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ప్రజలకు నష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వానికి నేటికీ విశ్వసనీయత ఉంది. అమరావతికి అడగగానే మాస్టర్ ప్లాన్ ఉచితంగా తయారుచేసిచ్చారు. కానీ వారి మీద కేసలు పెట్టి వేధించారు. అమరావతి బ్రాండ్ నాశనం చేశారు. వీళ్ల అరాచకం చూశాక మన ఏపీకి ఎవరు వస్తారు చెప్పండి. నాయకుడిపై నమ్మకం లేకనే నేతలు వారి దారి వారు చూసుకుంటున్నారు.
దావోస్‌లో ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సీఎం చంద్రబాబు బృందం జరిపిన చర్చల వివరాలు
మొదటి రోజు
• జ్యూరిచ్‌లో తెలుగు డయాస్పొరా సమావేశం నిర్వహించాం. యూరప్ లో ఉన్న ఐదారొందల మంది సదస్సుకు వచ్చారు. మన తెలుగు ప్రజల విజయాలు, లక్ష్యాలు, ప్రణాళికలు వంటి అంశాలు చర్చించాం.
• ఆర్సెలార్ మిట్టల్ : రాష్ట్రంలో ఆర్సెలార్ మిట్టల్ ఏర్పాటు చేస్తున్న స్టీల్ పరిశ్రమలపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో చర్చించాము.
• అనకాపల్లి జిల్లాలో రూ 1.35 లక్షల కోట్ల తో 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. దీనికి ఐరన్ ఓర్ సప్లైపై చర్చించాము.
• రెండు వారాల్లో భూమి కేటాయింపుల అంశాన్ని పూర్తి చేస్తాము.
• పర్యావరణ అనుమతులు అన్నీ పొంది…6 నెలల్లో శంకుస్థాపన చేయబోతున్నాం.
• జ్యురిచ్ ఎయిర్ పోర్టు : అమరావతి ఎయిర్ పోర్టుపై ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఎయిర్పోర్టును హబ్‌గా మార్చేలా జ్యురిచ్ ఎయిర్ పోర్టు సాయం తీసుకుంటున్నాం.
• దీనిపై ఆ సంస్థ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ టోబియాస్ బేర్‌తో చర్చించాం. రాష్ట్రంలో అవకాశాలను పరిశీలించేందుకు ఒక బృందం త్వరలో వస్తుంది.
• స్విస్ కంపెనీలు : స్విస్ కంపెనీలైన స్విస్‌మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ట్ ఫిస్టర్, స్విస్ టెక్స్‌టైల్స్ అధిపతులతో సమవేశం అయ్యాను. ఈ కంపెనీలు అవకాశాలను పరిశీలించేందుకు రానున్నారు.
రెండవ రోజు
• GLC & గ్రీన్ ఇండస్ట్రిలైజేషన్ : GLC గురించి ప్రకటించడంతో పాటు, భారత్‌లో గ్రీన్ ఇండస్ట్రిలైజేషన్‌పైనా సీఐఐ బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో చర్చించాం. ఒక రిపోర్టు ను ఆవిష్కరించాం.
• GMR, L అండ్ T, TCS వంటి సంస్థల భాగస్వామ్యంతో GLC ని తీసుకువస్తాం.
• GLC కోసం స్విట్జర్లాండ్ IMD బిజినెస్ స్కూల్‌తో CII భాగస్వామ్యంతో పనిచేస్తాం.
• డీప్ టెక్నాలజీస్ పై ప్రతిష్టాత్మక టోక్యో ఫుజి విశ్వవిద్యాలయం, అస్ట్రేలియా కు చెందిన న్యూ సౌత్ వేల్స్ యూనివర్సీటీ, IIT మద్రాస్ భాగస్వామ్యంపైనా చర్చించాం.
• డామెన్ హోల్డింగ్ బీవీ : రాష్ట్రంలో సముద్ర రవాణా పెంపొందించేందుకు, పోర్టుల నిర్వహణ-అభివృద్ధి, కంటైనర్ల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి రావాల్సిందిగా డామెన్ హోల్డింగ్ సీఈవో ఆర్నౌట్ డామెన్‌ను కోరాం. షిప్ బిల్డింగ్ లో ఈ సంస్ధకు మంచి పేరుంది.
• సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిన్ యాంగ్‌తో వన్ టు వన్ మీటింగ్ జరిగింది. నాడు సింగపూర్ మాస్టర్ ప్లాన్ తో రాజధాని నిర్మాణం పనులకు గత ప్రభుత్వం గండి కొట్టింది.
• ఈ విషయంలో వాళ్ల ఇమేజ్ ను కూడా దెబ్బకొట్టేలా తప్పుడు ప్రచారం చేశారు. ఆవిషయాలు చర్చించాం. ఇప్పుడు మళ్లీ వాళ్లను ఆహ్వానించే పరిస్థితి లేకుండా చేశారు.
• వెల్స్‌పన్ : రాష్ట్రంలో చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా ఆసక్తి చూపించారు. అలాగే టెక్స్‌టైల్ ప్లాంట్ల ఏర్పాటుకు, SINTEX తయారీతో సహా ఇతర విస్తరణ ప్రణాళికలపైనా ఇరువురం చర్చించాం.
• HAM మోడల్ లో నదుల అనుసంధానంలో భాగస్వాములు అయ్యేందుకు వాళ్లు ఆసక్తి చూపారు. నదుల అనుసంధానంలో నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ గారితో కూడా చర్చించాము. దీన్ని ముందుకు తీసుకువెళతాం.
• ఎల్జీ కెమ్ : దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌తో చర్చలు జరిపాం. కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరాం.
• ఇప్పటికే ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీలో రూ. 5 వేల కోట్లతో ప్లాంట్ పెట్టేందుకు సిద్దమైంది.
• కార్ల్స్‌బెర్గ్ గ్రూప్ : పళ్ల రసాలు, శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తో సమావేశమయ్యాం.
• రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని కోరాం. ఇందుకు విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీ ఇండస్ట్రియల్ పార్కులు పరిశీలించమని చెప్పాం.
• A.P. ముల్లర్-మార్స్క్ : ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో డెన్మార్క్‌కు చెందిన A.P. ముల్లర్-మార్స్క్ ఒకటి. ఏపీలో గ్లోబల్లీ మల్టీమోడల్ హబ్ ఏర్పాటు చేయమని అడిగాం.
• లాజిస్టిక్ హబ్ గా చేసేందుకు మారిటైం పై విజన్ సిద్దం చేయాలని కోరాం. మూడు వారాల్లో రిపోర్టుతో వస్తామని చెప్పారు.
• మార్స్క్ సీఈవో విన్సెంట్ క్లర్క్ రామయపట్నంలో కంటెనర్ టెర్మినల్ ఏర్పాటుకు ఆసక్తి చూపించారు. కంటెనర్ల తయారీ, షిప్ బిల్డింగ్ గురించి ఆలోచన చేస్తున్నారు.
• టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తోనూ భవిష్యత్ పెట్టుబడులపై చర్చించాను.
• UAE ఎకానమీ మినిస్టర్ : UAE నుంచి ఒక ప్రతినిధి బృందం ఫిబ్రవరి భారతదేశానికి వస్తోంది. ఆ పర్యటనలో భాగంగా విశాఖకు రమ్మని ఆదేశ ఎకానమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రిని ఆహ్వానించాం. UAEకి చెందిన SPOCతో EDB పనిచేసే అవకాశం ఉంది.
• సిస్కో : డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తో చర్చించాను.
• AI డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తయారీకి, డీప్ టెక్, వివిధ పరిశ్రమలలో సైబర్ సెక్యూరిటీపై సహకారాన్ని కోరాం.
• వాల్ మార్ట్ : ఆంధ్రప్రదేశ్‌లోని SHGలకు శిక్షణ కోసం ఫ్లిప్‌కార్ట్‌తో వాల్ మార్ట్ ఇంటర్నేషనల్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో వారి ఉత్పత్తులు విక్రయిచేలా బ్రాండింగ్, ప్యాకింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది.
• APలో MSMEలకు సహకారం అందించమని ఆ కంపెనీ సీఈవో కత్ మెక్లేను కోరాను.
• కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ గ్లోబల్ సీఈవో రవికుమార్ సమావేశం అయ్యాం. తరువాత ఐటీ మంత్రి లోకేష్ కూడా సమావేశం అయ్యారు. వాళ్లును ఎఐ, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టమని కోరాం. ఆసక్తి చూపించారు.
• JSW గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్. కడప స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకువెళ్లమని కోరాం. ఆయన సానుకూలంగా ఉన్నారు.
• భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ రజన్ భారతీ మిట్టల్ కూడా చర్చలు జరిపాం.
• మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ ఎండీ కృష్ణారెడ్డితోనూ ఎలక్ట్రిక్ బస్సులపై చర్చించాం.
మూడవ రోజు
• డీపీ వరల్డ్ : ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్‌లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్ సెంట్రల్ ఏసియా, ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సూమర్‌తో చర్చలు జరిపాం.
• కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో కంటైనర్ టెర్మినల్ అవకాశాలు పరిశీలించమని చెప్పాం. లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గిడ్డంగుల కోసం DP వరల్డ్ బృందం అధ్యయనం చేయనుంది.
• బహ్రెయిన్ ప్రతినిధులు : బహ్రెయిన్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్టర్ అబ్దుల్లా అదెల్ ఫాఖ్రో, ఫైనాన్స్ అండ్ నేషనల్ ఎకానమీ మినిస్టర్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ చర్చించాం.
• బహ్రెయిన్ ప్రతినిధి బృందం 100 మంది పారిశ్రామికవేత్తలతో కలిసి ఫిబ్రవరి/మార్చి 2025లో మన రాష్టంలో సందర్శిస్తుంది.
• బహ్రెయిన్ డెవలప్‌మెంట్ బోర్డ్‌తో EDB చర్చలకు అబ్దుల్లా ప్రతిపాదించారు. వైజాగ్, విజయవాడలో పెట్టుబడులకు గల అవకాశాలను EDB వాళ్ల ముందు ఉంచుతుంది.
• పెట్రోనాస్ : మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్‌తో భేటీ అయ్యాను.
• కాకినాడ ప్లాంటు నుంచి గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయనుంది. అయితే 2026 దావోస్ సమావేశం కల్లా కాకినాడ పోర్టు నుంచి ఉత్పత్తి బయటకు వచ్చేలా చూడాలని చెప్పాం.
• రాష్ట్రంలో గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు కన్సల్టెంట్‌ను పెట్రోనాస్ నియమించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్ అవసరమని అంశాన్ని చర్చించాం.
• గూగుల్ క్లౌడ్ : సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించమని కోరాం.
• గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో చర్చించగా కొత్తగా ఎన్నికైన US ప్రభుత్వం చిప్‌ల ఎగుమతిపై 10 శాతం పరిమితి విధించిందని చెప్పారు.
• ఇది మన డేటా సిటీ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిపై US ప్రభుత్వానికి లేఖ రాయడానికి కురియన్ ఏపీ సాయం కోరారు. కేంద్రం ద్వారా ప్రయత్నిస్తాం.
• డీప్ టెక్‌ని అన్ని రంగాల్లో ప్రవేశపెట్టే విషయంలో Google భాగస్వామ్యం కానుంది. ఏపీలో సర్వర్ రిపేర్, మెయింటెనెన్స్‌ని సెటప్ చేసే అవకాశాన్ని Google బృందం పరిశీలించనుంది.
• పెప్సీకో : రీజనరేటివ్ అగ్రికల్చర్‌పై AP, పెప్సీ కలిసి పనిచేయాలని నిర్ణయించాం. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతో రైతులకు మద్దతుగా నిలిచేలా పెప్సీకో ఆలోచన చేస్తోంది.
• దీనిపై పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్‌తో చర్చలు జరిపాం.
• సెన్మట్ : వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో భేటీ అయ్యాను. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి అంశాలపై చర్చించాం.
• బిల్ గేట్స్ – BMGF : డీప్‌టెక్ అడ్వైజరీ కౌన్సిల్‌కు నేతృత్వం వహించమని BMGF ఫౌండర్ బిల్‌గేట్స్‌ను కోరాను. వ్యవసాయం-వైద్యరంగంలో AI వినియోగంపై చర్చించాం.
• అగ్రిటెక్, మెడ్ టెక్ పై బిల్ గేట్స్ ఆసక్తి చూపారు.రెండు డాలర్లకే TB పరీక్షలు, TB డ్రగ్ విషయాల్లో సాయాన్ని అడిగాం. ఈ ఏడాది మార్చి 16న బిల్ గేట్స్ భారత్ కు వస్తున్నారు. అప్పుడు మళ్లీ కలిసి చర్చిస్తాం.
• గూగుల్, మైక్రో సాఫ్ట్, ఐఐటిఎం, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాలనలో ఎఐ వినియోగం పెంచేందుకు కమిటీ నియమించే అంశాన్ని మేం ఆలోచిస్తున్నాం. ఈ విషయంలో దిగ్గజ ఐటీ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ లను సంప్రదించాం.
• హిందుస్థాన్ యూనిలీవర్ : యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు సేకరించే విషయంపైన చర్చించాను.
• ఇవి కాకుండా ఐటీ మంత్రి నారా లోకేష్ మరో 37 సంస్థల సీఈవోలతో భేటీ అయ్యారు.