అన్నీ కాజేస్తున్న వైసీపీ దొంగలు

• ఓబులాపురం గనుల నుంచి సామాన్యుల ఆస్తుల వరకు అన్నీ కాజేస్తున్న వైసీపీ దొంగలు
• రాష్ట్రంలోని గనులను కబ్జా చేసి పారిశ్రమికవేత్తలు ఆ రంగంలోకి అడుగు పెట్టినివ్వకుండా చేశారు

• గతంలో టీడీపీ లేవనెత్తిన ఆరోపణలను తాజాగా విడుదల చేసిన గెజిట్ నోఫికెషన్ బలపరుస్తుంది
– కడప స్టీల్ ప్లాంటుకు ఓబులాపురం ఇనుప ఖనిజాన్ని తరలిస్తే కడప స్టీల్ ప్లాంటు పేరుతోనే క్యాపిటల్ మైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది
• ఓబులాపురం కేంద్రంగా సాగుతున్న దోపిడీని అడ్డుకుంటాం
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో కాల్వ శ్రీనివాసులు ఏమన్నారో ఆయన మాటల్లోనే…!

రాష్ట్రంలోని సహజ వనరులను వైసీపీ నాయకులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మూడున్నరేళ్లుగా యదేచ్ఛగా ఈ తంతు సాగుతోంది. స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్, రాయలసీమలో విలువైన ఖనిజాలను కబ్జా చేస్తున్నారు. చిన్న యువ పారిశ్రామికవేత్తలు ఆ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలని, ఆశలని వమ్ముచేస్తూ వాళ్ల కబ్జాలోకి గనులన్నింటిని తీసుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

అర్హులైన వారు దరఖాస్తు చేసినా గనులు దక్కే అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ చూస్తే అనంతపురం జిల్లా సరిహద్దులో, బళ్లారి సమీపంలో ఉండే ఓబుళాపురం గ్రామ సరిహద్దులో హెచ్ సిద్ధాపురం తాండదగ్గర 25 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఐరన్ ఓర్ మైనింగ్ ప్రాంతాన్ని ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు దారాధత్తం చేశారు. ఇది ప్రభుత్వ రంగ సంస్ధ. కడప స్టీల్ ప్లాంటుకు ఈ ఇనుప ఖనిజాన్ని తరలిస్తే కడప స్టీల్ ప్లాంటు పేరుతోనే క్యాపిటల్ మైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాని.. ఏపీ ఎమ్.డి.సి ద్వారా తెలంగాణకు చెందిన మరో ప్రైవేటు వ్యక్తికి దారాధత్తం చేశారు.

ఏయమ్ఆర్ కంపెనీకి చెందిన ఓ బడా కాంట్రాక్టర్ కు దారధత్తం చేస్తూ ఇప్పటికే అగ్రీమెంటు చేసుకున్నారు. 75శాతం అక్కడ లభించే ఖనిజాన్ని కడప స్టీల్ ప్లాంటుకి ఇవ్వాలనే నిబంధనని పెట్టారు. కాని దానిని పర్యవేక్షించేవారే కరువయ్యారు. వైసీపీ నాయకులు ఇప్పటికే ఇసుక, మట్టిని వదలకుండా యదేచ్ఛగా దోచుకుంటున్నారు. ఈ దోపిడి వారికి రాజమార్గం అయింది. ఓబులాపురం మైనింగ్ ప్రాంతంలో జరగబోయే మైనింగ్ దోపిడీని ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఇందులో స్వయంగా మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. మంత్రి పరోక్ష భాగస్వామ్యంతోనే ఇదంతా జరుగుతోందనే మాకు సమాచారం అందుతోంది. గతంలో ఓబులాపురంలో జరిగిన మైనింగ్ దోపిడికి ఇది పార్ట్ – 2. ఏపి యమ్.డి.సి ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా తవ్వకాలు జరుగుతున్నాయి. వాళ్ల అజమాయిషిలోనే గనుల నిర్వహణ ఉంది. పర్యవేక్షణ మొత్తం వాళ్ళే చూసుకునే పరిస్ధితి ఉంటే విచ్చలవిడిగా వాళ్ళు ఇతరులకు అమ్ముకునే అవకాశం ఉంటుంది.

దీనిపై గతంలో టీడీపీ డిమాండ్ చేయడం జరిగింది. పర్యవేక్షణా భారం ఎందుకు ప్రభుత్వమే తీసుకోవడం లేదని మేం ప్రశ్నిస్తున్నాం. క్యాప్టివ్ మైనింగ్ కింద ఎందుకు కడప స్టీల్ ప్లాంటుకు ఇవ్వడం లేదు. ఈ రకంగా దొంగ దారులలో, దొడ్డి దారుల్లో మరో దోపిడికి తెర తీయాల్సిన అవసరముంది.మేం గతంలో లేవనెత్తిన అనుమానాలను తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ బలపరుస్తోంది.

ఓబులాపురంలో మరోసారి ఇనుప ఖనిజం దోపిడికి కుట్ర జరుగుతోందని టీడీపీ తరపున ఆరోపిస్తున్నాం. ఈ దోపిడీని అడ్డుకోవడానికి స్థానికి ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలు చేస్తాం. అక్కడ విలువైన ఇనుప ఖనిజాన్ని దోపిడి కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రాయదుర్గం కోర్టు గతంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ దగ్గర సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత దొంగతనంగా విక్రయించారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇందులో రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి పాత్ర ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోంది.సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దొంగతనంగా మళ్ళించారంటే ఇది మాములు వ్యక్తులు వల్ల కాదు. అధికారంలో ఉన్నవారికి మాత్రమే సాధ్యం. కాబట్టి దీని పై కేసు నమోదు చేయాలని అక్కడున్న మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

కుంభకోణాలు, సహజ వనరులను దోచుకోవడం, ప్రజల ఆస్తులను కబ్జా చేయడం వైసీపీ నాయకులకు షరా మామూలైపోయింది. రోజుకో దోపిడి వెలుగులోకి వస్తోంది. ఈ సందర్భంలో ఓబులాపురం కేంద్రంగా సాగుతున్న దోపిడిని నివారించాలి. ఈ దోపిడీ, దురాగతాలకు కళ్లెం వేయడానికి టీడీపీ నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కడప స్టీల్ ప్లాంటుకే ఓబులాపురం ఖనిజాన్ని తరలించాలని డిమాండ్ చేస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

Leave a Reply