‘‘ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం ఇస్తుందో చెప్పండి? మేం ఇస్తున్న నిధులే మాకు ఇస్తున్నారు. మాకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేసి, అప్పుడు మీ గొప్పల గురించి చెప్పుకోండి. అయినా మీరు కూడా అప్పులు చేస్తున్నారు కదా’’.. అప్పుడెప్పుడో కొడాలి అండ్ ఆళ్ల నాని పత్రికాముఖంగా రాష్ట్ర బీజేపీ నేతలకు సంధించిన ప్రశ్నలివి. అటు కాంగ్రెస్ సైతం, రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాష్టానికి ఏయే రంగాలకు నిధులు కేటాయిస్తుందో ఓసారి చూద్దాం. వీటిలో ముప్పావు శాతం పధకాలు.. కేంద్ర నిధులతో నడుస్తుండగా, మరికొన్ని కేంద్ర నిధులు మళ్లించి.. జగన్ సర్కారు అమలుచేస్తున్నవి.
ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న పథకాలు
1 గ్రామాల్లో సిమెంట్ రోడ్లు
2 కట్టిన సచివాలయం బిల్డింగులు
3 కట్టిన విలేజ్ క్లినిక్స్
4 కట్టిన రైతు భరోసా కేంద్రాలు
5 ఇంటింటికి కుళాయి నీళ్లు
6 ప్రధానమంత్రి ఉచిత ఇల్లు కట్టుకోవడానికి డబ్బు
7 గ్రామాల్లో వాటర్ ట్యాంకులు
8 డ్వాక్రా మహిళలకు రుణాలు
9 ఐదు లక్షల వరకు చికిత్స పొందే కార్డులు ఆయుష్మాన్ భారత్
10 పిఎం కిసాన్ నిధులు సంవత్సరానికి 6000
11 స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనం, క్లాసురూము ఆధునీకరణ, యూనిఫామ్స్ , స్కూల్ డెవలప్మెంట్. వీటికి 75% వాటా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది
12 గర్భిణీ లకు పౌష్టిక ఆహారం మరియు ప్రసవ సమయంలో 5000 రూపాయలు
13 అంగన్వాడీలో అందరికీ ఇస్తున్న పౌష్టిక ఆహారం
14 పల్లెటూర్లలో డ్రైనేజీ వ్యవస్థ సైడు కాలువలు
15 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్కరు పనిచేసినందుకు 169 రూపాయలు పంచాయతీకి నిధులు ఇవ్వటం
16 పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేయడం
17 ప్రతి నెల ప్రతి గ్రామానికి వైద్య సదుపాయం
18 పశువుల కి సంబంధించి ఆంబులెన్సులు
19 గ్రామాల్లో వీధి దీపాలు
20 అందరికీ ఉచిత రేషన్
21 104 వాహనాలు
22 భూములకు డిజిటల్ ధృవపత్రం
23 వీధి వ్యాపారులకు 10,000 రూపాయల రుణం
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటిలో ఏదైనా కేంద్ర ప్రభుత్వ వాటా లేదు అని మీరు చెప్పగలరా?
– పుల్లార్కట్ దిలీప్
బీజేపీ సీనియర్ నేత
విజయవాడ