జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగం

– జగన్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాడు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైంది. పుంగనూరు వీరప్పన్ పెద్ది రెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్ తో వైకాపా పార్టీ రెడ్ శాండిల్ మాఫియా అవతారం ఎత్తింది. ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాడు. అడ్డొచ్చిన పోలీసుల్ని వైకాపా రెడ్ శాండిల్ మాఫియా చంపేస్తుంది.

అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై మెరుపుదాడులకు పాల్పడి , కానిస్టేబుల్ గణేష్ ని చంపేయ‌టం రాష్ట్రంలో వైకాపా రెడ్‌శాండిల్ మాఫియా దారుణాల‌కు ప‌రాకాష్ట‌. టాస్క్ ఫోర్స్ పోలీసు వాహ‌నాల‌నే ఢీకొట్టి కానిస్టేబుల్‌ని చంపేశారంటే.. స‌ర్కారీ పెద్ద‌ల అండ‌దండ‌ల‌తో ఎంత‌గా బ‌రితెగించారో అర్థం చేసుకోవ‌చ్చు.

విధినిర్వ‌హ‌ణ‌లో పాల‌కుల మాఫియాకి బ‌లైన కానిస్టేబుల్ గ‌ణేష్ కి నివాళులు. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. గ‌ణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. గణేష్ ని అత్యంత కిరాతకంగా చంపేసిన రెడ్ శాండిల్ మాఫియాని కఠినంగా శిక్షించాలి.

Leave a Reply