Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల చరిత్ర తెలియని అజ్ఞానా?లేక కావాలనే అబద్దాలు చెబుతున్నారా?

– సంవత్సారాల తరబడి సజ్జల మాటలు వింటున్నాం..ఆయన నోటి నుంచి అసత్యాలు, అబద్దాలు తప్ప సత్యాలు రావు
– చంద్రబాబు నాయుడు దీక్ష విజయవంతం కావటంతో వైసీపీ నేతలు కడుపుమంటతో బాధపడుతున్నారు
– మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు
చంద్రబాబు నాయుడు దీక్ష విజయవంతం కావటంతో వైసీపీ నేతలు కడుపుమంటతో బాధపడుతున్నారు. చంద్రబాబు దీక్షపై సజ్జల వ్యాఖ్యలు సిగ్గుచేటు. జాతిపిత గాంధీగారు రోజుల తరబడి నిరాహార దీక్ష చేసిన సంగతి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసా? తెలియదా? ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు 70 ఏళ్లకు పైబడ్డవాళ్లు చరిత్రలో ఎన్నెన్నో నిరాహార దీక్షలు చేసియున్నారు. ఈ విషయాలపైన చారిత్రక జ్ఞానం సజ్జలకు ఉందా? లేదా?
చంద్రబాబునాయుడు 36 గంటలు నిరాహారదీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు ….. తెలుపలేదు. కేబినెట్ హోదాలో ఉండే ప్రతిపక్ష నేతకి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు డాక్టర్ ను పంపి పరీక్షలు చేయించలేదు? చంద్రబాబునాయుడు యొక్క నిబద్దత, ఆయన క్రమశిక్షణ, ఆయన ఆరోగ్యం అన్ని రకాలుగా కంట్రోల్ లో ఉన్న విషయం యావదాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుసు. డ్రగ్ మాఫియా వల్ల యువత నిర్వీర్యమౌతుందే అన్న విషయం చంద్రబాబునాయుడుగారి దీక్ష తో జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుతోందని. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి 70 ఏళ్ల వయసుండే వారి యొక్క నిబద్ధతపై 70 ఏళ్ల వయస్కులందర్నీ సజ్జల రామకృష్ణా రెడ్డి నిందిస్తున్నారు. ఇది క్షమార్హం కాదు. గతంలో జగన్ దీక్షలు చేసినప్పుడు దీక్షా నిభందనలు ఉల్లంఘించారని వార్తలొచ్చాయి. వారి దిగజారుడుతనాన్ని ఎదుటివారిపైకి ఆపాదించి దుస్తితికి వైసీపీ దిగజారింది.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో ఏమూల గంజాయి, డ్రగ్స్ పట్టుబడ్డా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. ఇలా గత 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేదు. స్పెషల్ ఎన్ పోర్స్ మెంట్ బ్యూరోను సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కాపలాకు పెట్టుకుని కల్తీ మద్యంతో వేలకోట్ల అవినీతికోసం ఉపయోగించుకుంటున్నారు. తప్ప గంజాయి, డ్రగ్స్ కట్టడి చేయటానికి కాదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేడు రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అక్రమ రవాణా జరగటం నిజం కాదా? తెలంగాణలో గంజాయి పంటను నిషేదించారు. ఎక్కువగా మావోయిస్టులు ఉన్న రాష్ట్రాల్లో సైతం గంజాయిని నిషేదిస్తే ఏపీలో ఎందుకు నిషేదించలేదు?
గంజాయి, డ్రగ్స్ వ్యాపారంలో వైసీపీ నేతలకు వాటాలున్నందుకే దీనిపై చర్యలు తీసుకోలేదా? దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. సంవత్సారాల తరబడి సజ్జల మాటలు వింటున్నాం..ఆయన నోటి నుంచి అసత్యాలు, అబద్దాలు తప్ప సత్యాలు రావు. సజ్జలకి ఎదుటివారిపై బురద చేయటం.. అలవాటు. గతంలో పింక్ డైమండ్ పై చంద్రబాబుపై అసత్య ప్రచారం చేసి అభాసుపాలయ్యారు. వైసీపీ చరిత్రంతా అబద్దాలు, అరాచకం, అవినీతి పునాదిగా ఉన్నది. తమ అవినీతిని , అబద్దాల్ని అరాచకాల్ని అంటగట్టే కుట్ర చేస్తే రాష్ట్ర ప్రజలు నమ్ముతారనుకోవటం అమాయకత్వం.

LEAVE A RESPONSE