కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దాడి యత్నం

– ఓటమి భయంతోనే ..
– కేసీఆర్, హరీష్ రావు ప్రోద్బలంతోనే..
– బండి సంజయ్, డీకే అరుణ
ఇళ్లందకుంట మండలంలోని సిరిసెడు గ్రామంలో కిషన్‌రెడ్డి రోడ్ షోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్ షోలోబీజేపి, టీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు తారస పడ్డారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై ఈటెల


అంటూ పోటా పోటీ నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. ఇరువర్గాలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇరువర్గాలకు స్వల్ప గాయాలు అయ్యాయి. పావు గంట పాటు రోడ్డు మార్గం స్తంభించింది. ఎట్టకేలకు ఇరువర్గాలను పోలీసులు శాంతింప చేసారు. పలువురిపై పోలీసులు చేయి చేసుకున్నారు.
హుజూరాబాద్ లోని మధువని గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
బండి సంజయ్ కుమార్ :-
-కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ నేతలు దాడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
• ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో ఈ ధాడి జరిగింది.
• వందల, వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజల మనసు మార్చలేరని కేసీఆర్ గ్రహించారు.
• ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసినా ఫలితం లేదని కేసీఆర్ కు అర్ధమైంది.
• ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి శాంతిభద్రతల సమస్యను స్రుష్టించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.
• పోలింగ్ కు ప్రజలు రాకుండా భయభ్రాంతులకు గురిచేసేలా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.
• జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ టీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నించి విఫలమైంది.
• బీజేపీ దాడులు చేస్తుంది. మత కల్లోలాలు స్రుష్టించే కుట్ర చేస్తున్నారంటూ ఆనాడు దుష్ప్రచారం చేసి విఫలమయ్యారు.
• హుజూరాబాద్ ఎన్నికల్లోనూ మళ్లీ ఇదే కుట్రను అమలు చేయబోతున్నారు.
• కేంద్ర మంత్రి ప్రచారంపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ప్రేక్షకపాత్ర పోషించడం దారుణం.
• ఓటుకు రూ.20 వేలు పంపిణీ చేయాలని యత్నించి విఫలమవుతుండటంతో ఆ పార్టీ నాయకులతోనే కేసీఆర్ భౌతిక దాడులకు పురిగొల్పుతున్నారు.
• ప్రజాస్వామ్య బద్దంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే బీజేపీ అభిమతం.
• దాడులతో భయపెట్టాలని చూస్తూ ఊరుకునేది లేదు. బీజేపీ జాతీయ పార్టీ. త్యాగాలు చేసిన పార్టీ.
• పేదల కోసం, ప్రజలను కాపాడేందుకు దాడులను ఎదుర్కొంటూ ప్రతిఘటించిన చరిత్ర బీజేపీకి ఉంది.
• కేసీఆర్….సపరేట్ బ్యాచ్ లతో దాడులు చేయించాలని కుట్ర చేస్తున్నారు.
• దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటివి చేస్తే బీజేపీ తిప్పికొట్టిన సంఘటనలు మర్చిపోవద్దు.
• టీఆర్ఎస్ కు డిపాజిట్ వచ్చే అవకాశమే లేదనే భావనతో ఇలాంటి దాడులకు కేసీఆర్ పురిగొల్పుతున్నడు.
• ఈ ఘటనపై జాతీయ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినం.
• అధికారులకు, పోలీసులకు మా విజ్ఝప్తి….టీఆర్ఎస్ పాలన ఉండేది ఇంకా రెండేళ్లలోపే…ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అధికార పార్టీకి కొమ్ముకాయడం బాధాకరం.
• ప్రజల కోసం ఒకనాడు ప్రాణ త్యాగం చేసిన పోలీస్ వ్యవస్థ నేడు….అధికార పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరించడం దారుణం.
• తక్షణమే దాడులకు కారకులెవరు? దాడులు చేసిందెవరు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాం.
• ఎన్నికల్లో భయానక వాతావరణం స్రుష్టిస్తున్నారు. పోలీస్ అధికారులను వెంటనే బదిలీ చేయాలని కోరుతున్నాం.
• కేంద్ర కేబినెట్ మంత్రి వస్తే….కనీస భద్రత ఇవ్వకపోవడం దారుణం. ఇది మంచి పద్దతి కాదు.
• ఎన్నికలు వస్తుంటాయి…పోతుంటాయి. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడితే సహించబోం.
• దాడులకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాం.
• ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల జరగాలంటే భద్రతా దళాలను పెంచాలి. పోలీసు అధికారులను మార్చాలని డిమాండ్ చేస్తున్నాం.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ :-
• ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి క్యాంపెయిన్ దాడి చేశారు.
• ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మేం ఏమైనా చేస్తామనే సందేశాన్ని ఇవ్వాలని టీఆర్ఎస్ యత్నిస్తోంది.
• బీజేపీ ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
• ఎన్నికల్లో ఏదైనా చేస్తాం…డబ్బుతో ఓట్లను కొంటాం…రాష్ట్రాన్ని కొల్లగొట్టినం. అవినీతి సొమ్మంతా మా దగ్గరుంది. ఏదైనా చేస్తామని కేసీఆర్ అనుకుంటున్నారు.
• అధికారం ఉంది కదా…ఏదైనా చేస్తామని ఇంటికో పోలీసు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా వ్యవహరిస్తామని టీఆర్ఎస్ భావిస్తోంది.
• కేసీఆర్ యత్నాలను బీజేపీ చూస్తూ ఊరుకోబోదు.
• ఉప ఎన్నికను కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలనే కేసీఆర్ తీరును చూస్తుంటే జాలేస్తుంది.
• రోజుకో అబద్దంతో కాలం గడుపుతున్నారు.
• దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్ ఎన్నికల కోసమే తీసుకొచ్చారు. చివరకు ఆ పథకాన్ని అమలు చేయలేక చతికిలపడ్డ కేసీఆర్ ఆ నెపాన్ని బీజేపీపై నెట్టడం సిగ్గు చేటు
• భూముల అమ్ముకుని ఆదాయం తెచ్చుకునే స్థితికి దిగజారిన కేసీఆర్ ..దళిత బంధు పేరుతో హుజూరాబాద్ ప్రజలను మోసం చేసే యత్నం చేస్తున్నారు.
• రాష్ట్రంలో పేద దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలన్నదే బీజేపీ డిమాండ్
• కేసీఆర్ తాటాకు చప్పళ్లకు బీజేపీ భయపడదు.
• హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇఫ్పటికే బీజేపీకి ఓటేసి ఈటల రాజేందర్ ను గెలిపించాలనే నిర్ణయానికి వచ్చేశారు.
• కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఫలించవు.
• కేసీఆర్…ఖబడ్దార్…మళ్లీ ఇలాంటి దాడులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు.
• మీకు చేతనైతే….ప్రజల వద్దకు వెళ్లి దళిత బంధు ఇవ్వడం మాకు చేతకాలేదంటూ ప్రజల కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply