– యాభైవేల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు 2, 3 వేలకు ఎందుకు తగ్గిపోయారు?
– వరల్డ్ ఎకనమిక్ ఫోరం కు వెళ్లక పోవడానికి సరైన కారణాలు ఏంటి ?
– ప్రభుత్వానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రశ్నలు
అమరావతి : ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ముందు ప్రభుత్వానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పలు ప్రశ్నలు సంధించారు. అవేంటంటే..
- పెట్టుబడుల స్వర్గధామం ఆయిన దావోస్ లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం కు వెళ్లక పోవడానికి సరైన కారణాలు ఏంటి?దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట ఎంత దెబ్బతిందో కనీసం ఇప్పటికైనా గుర్తించారా?
- ఒక రాజధానినే నిర్మించుకోలేని లేని రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించగలం?
- జాకీ (Jockey) అనే అండర్వేర్ కంపెనీ రాష్ట్రంలో ఉండలేమని పారిపోతుంటే ఏమి చేశారు? కారణాలని విశ్లేషించి ఆ తప్పులను సరిదిద్దుకుని పునరావృతం కావన్న భరోసా ఇచ్చారా?
- కియా కంపెనీకి అనుబంధ కంపెనీలు ఒక్కటీ తీసుకురాలేక పోయినందుకు ఆత్మ సమీక్ష చేసుకున్నారా?
- హెచ్ఎస్‌బీసీ (HSBC) ఇక్కడ నుంచి వెళ్లకుండా ఆపే ప్రయత్నం కనీసం చేశారా?
- లులూని ఇక్కడ నుంచి తరిమేశామని ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చెబుతారా?
- అమర్‌రాజా బ్యాటరీస్ ను విజయవంతంగా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టామని సమ్మిట్‌లో గొంతెత్తి చెబుతారా?
- భోగాపురం ఎయిర్ పోర్ట్‌ను నాలుగేళ్లు శంకుస్థాపన చేయకుండా వదిలేసి ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారు?
- ఈ సమ్మిట్ కే 25 ఛార్టర్డ్ ఫ్లైట్స్ వస్తుంటే ప్రస్తుత ఎయిర్ పోర్టులో18 కి మాత్రమే పార్కింగ్ చేసే సౌకర్యం ఉందని ఎలా చెబుతున్నారు? అదే భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించుకుని ఉంటే ఈ సమస్య ఉండేదా?
- నాలుగేళ్లలో రాష్ట్రంలో అప్పటికే ఉన్న పోర్ట్‌లు తప్ప కొత్తగా ఒక్క పోర్ట్‌ను అయినా అభివృద్ధి చేశారా?
- అసలు మీరు పారిశ్రామిక వేత్తలలో ఎలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా పెట్టుబడుల సదస్సు పెట్టేంత సాహసం చేయడం వెనుక మీ కాన్ఫిడెన్స్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులను ఆహ్వానించగలమా?
- 2019 లో విశాఖలో దాదాపు యాభైవేల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు 2, 3 వేలకు ఎందుకు తగ్గిపోయారు?
- మీ ప్రభుత్వం వచ్చాక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఒక్క కంపెనీకి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?
- ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి ఫిన్ కార్ప్ కంపెనీలు ఎందుకు ఇక్కడ నుంచి పారిపోయాయి?
- అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన జరిగింది.. కానీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయినా మళ్లీ అదనంగా భూమి కేటాయించడం వెనుక రహస్యం ఏంటి?
- ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రతీ నెలా మొదటి తేదీ నుంచి చివరి తేదీ దాకా ఎందుకు తీసుకుంటున్నారు?
- తన ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వలేని ప్రభుత్వాలను నమ్మి పెట్టుబడులు ఎలా వస్తాయో చెప్పగలరా?
- సరైన ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తారా?
- చిట్టచివరిగా మీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యాక, ఎన్నికలకు ఏడాది ముందు పెట్టుబడుల సదస్సు పేరుతో ఈ హడావుడి వెనుక కారణాలేంటి?
ఈ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి ఎంత మాత్రం కావని… మన రాష్ట్రంలో సగటు పౌరుని సందేహాలని… సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని గంటా తెలిపారు.