ఆమె రేణుకాచౌదరి కాదు.. రాక్షస చౌదరి

-నాడు రాజ్యసభలో ప్రధాని మోదీనే ఆ పేరుపెట్టారు
-రేణుకా మెంటల్‌కు మా ఆరోగ్యశ్రీలో చికిత్సచేయిస్తాం..
-గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తో కళ్లు మండి చంద్రబాబు.. రేణుకా చౌదరిని రంగంలోకి దించాడు
-చంద్రబాబు, రేణుకా చౌదరిలు ఎంత మాట్లాడినా రాష్ట్రంలో వినే వారు లేరు
-కుక్కలెన్ని మొరిగినా ఏనుగు స్థాయి తగ్గదు
-ఎక్కడ పోటీ చేస్తావో చెయ్…నీ కోసం వెయిటింగ్ ఇక్కడ…
-అసమర్ధ కొడుకుతో చంద్రబాబు.. అడ్డగోలు కూతురుతో రేణుకాచౌదరి
-మహానేత వైఎస్‌ఆర్‌ సంతానంపై అంత కడుపుమంట ఎందుకు..?
-చంద్రబాబుకు ఉమెన్ వెర్షన్ రేణుకాచౌదరే
-నోరుఅదుపులో పెట్టుకోకపోతే బడితెపూజ ఖాయం
-2024 ఎన్నికల్లో వార్‌వన్‌సైడే.. వైఎస్‌ఆర్‌సీపీదే హవా
-నీకు పోటీచేసే దమ్ముంటే.. ఓడించేందుకు మేమూ సిద్ధం
:వైఎస్‌ఆర్‌సీపీ విజయవాడ నేత కొత్తపల్లి రజినీచౌదరి సవాల్‌

తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయవాడ నాయకురాలు కొత్తపల్లి రజినీచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..:

అవుట్‌డేటెడ్‌ పొలిటీషీయన్‌ రేణుకాచౌదరి
విశాఖపట్నంలో రెండ్రోజులపాటు జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంతో చంద్రబాబు కళ్లుమండుతున్నాయి. అందుకే, పనిగట్టుకుని అవుట్‌డేటెడ్‌ పొలిటీషీయన్‌ రేణుకాచౌదరిని పురమాయించి చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయిస్తున్నాడు.
పక్కరాష్ట్రంలో పాతసామానుల్లో పడేసిన ఇనుప డ్రమ్ములా ఉండే రేణుకాచౌదరి ఈ రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటోంది. డబ్బాలో గులకరాళ్లు ఆడించిన శబ్ధంలా ఆమె మాటలు అర్థంపర్థంలేకుండా ఉన్నాయి. చంద్రబాబు ఆడించినట్లు ఆడినా.. ఆయన మాట్లాడించినట్లు వాగినా.. రేణుకాచౌదరి మాటల్ని ఇక్కడెవరూ వినేందుకు.. నమ్మేందుకు సిద్ధంగా లేరు.

కుక్కలా మొరిగితే రాజకీయ మైలేజీ వస్తుందా..?
రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉంటూ ఉన్నతమైన పదవుల్లో పనిచేసిన ఒక మహిళా నేతగా.. ఇతర మహిళా నేతలకు ఆదర్శంగా ఉండాల్సిన రేణుకాచౌదరి ప్రవర్తన, ఆమె భాషాశైలిని చూసి ఈరోజు రాజకీయాల్లో ఉన్న మహిళానేతలంతా ఛీకొడుతున్నారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతానని ఇక్కడకొచ్చిన రేణుకాచౌదరి ట్రాక్టర్‌ ఎక్కి కుక్కలా మొరుగింది. స్వయాన ముఖ్యమంత్రిని పట్టుకుని అనరాని మాటలంటే.. తనకు రాజకీయ మైలేజీ పెరుగుతుందేమోనని ఆశపడుతుంది. కుక్కలెన్ని మొరిగినా ఏనుగు స్థానం ఎంతకీ దిగజారదని రేణుకాచౌదరి తెలుసుకోవాలి.

బడితెపూజకు సిద్ధమై వస్తావా..?
‘చూడమ్మా.. రేణుకా.. నీలాంటి కుక్కలెన్ని మొరిగినా.. ఇక్కడ ఎవరూ స్పందించరు’. సందర్భం, సంబంధం లేకుండా ఎవడో చంద్రబాబు చెప్పాడని.. మా ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోరుపారేసుకుంటే.. ఇక్కడెవరూ చూస్తూ ఉండరు. ఖబడ్దార్‌.. రేణుకాచౌదరి. నువ్వు విజయవాడ వస్తావో.. మరెక్కడికైనా వస్తావో.. మా మహిళానేతల చేతుల్లో బడితెపూజకు సిద్ధమై వస్తావా..? మరోసారి మా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పై నోరుజారితే మాత్రం నీకు ఘోరపరాభవం తప్పదని హెచ్చరిస్తున్నాను.

చంద్రబాబుకు ఫిమేల్‌వెర్షన్‌ రేణుకాచౌదరి
నిత్యం కుళ్లు, కుతంత్రాలతో రాజకీయ పైరవీలు నడుపుతూ పదవుల్ని వెలగబెట్టిన రేణుకాచౌదరిని చంద్రబాబు ఫిమేల్‌ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. ఆమె ఈరోజు కొత్తగా తెలంగాణను విడిచి ఇక్కడ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతుందనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. అచ్చం చంద్రబాబులాగానే ఆదినుంచి కుట్ర రాజకీయాలు, బ్లాక్‌ మెయిలింగ్‌ ఎత్తులతో పదవులు తెచ్చుకోవడమనేది రేణుకాచౌదరికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు. రాజకీయాల్లో ఆమె చరిత్ర గురించి తెలిసిన వాళ్లంతా ఇదే చెబుతారు.

రేణుకా, చంద్రబాబు సంతానంపై ఊరంతా చర్చలేగా..
అసమర్ధ, అడ్డగోలు సంతానం గురించి మాట్లాడుకోవాలంటే.. ఒక రేణుకాచౌదరి సంతానం, చంద్రబాబు సంతానం గురించి గుర్తుచేసుకోవాల్సి ఉంది. రేణుకాచౌదరి రాజకీయ ప్రస్థానం బాటిల్‌తో మొదలైతే.. ఆమె కూతురు మాత్రం డ్రగ్స్‌తో ముగించింది. ఒక మహిళానేతగా నేను ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ, ఈరోజు రేణుకాచౌదరి సంతానం గురించి మేం మాట్లాడకపోయినప్పటికీ.. ఆమె కూతురి డ్రగ్స్‌ భాగోతాలపై యూట్యూబ్‌ వీడియోలు చూసిన వారి సంఖ్య చెబుతుంది.
ఇక, చంద్రబాబేమో ఒక అసమర్ధుడైన కొడుకును కన్నాడు. దొడ్డిదారిలో ఎమ్మెల్సీ ఇచ్చి మూడు మంత్రిత్వశాఖలు వెలగబెట్టినా ఏమీ చేయలేని దద్దమ్మగా మిగిలాడు. తన సొంత సామాజికవర్గం ఓట్లతో గెలిచేస్తాడని మంగళగిరిలో ఎమ్మెల్యే స్థానానికి పోటీకి నిలబెడితే గెలవలేని అసమర్ధ కొడుకయ్యాడు లోకేశ్‌. చంద్రబాబు పరువు తీసిన అసమర్ధ సంతానం గురించి.. తల్లిని మించిపోయిన డ్రగ్గిస్టు కూతురు గురించి పక్కనబెట్టి ఇతరుల సంతానంపై మాట్లాడటంలో అర్ధముందా..?

ఒంటిచేత్తో పార్టీ పెట్టి అధికారంలోకొచ్చిన ధీశాలి ‘మా జగనన్న’
మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంతానంగా మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రుల ఆరాధ్యదైవంగా నిలిచారు. మనిషి మరణించినా ఆయన చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచే ఉంటాయన్న రీతిగా మహనేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసి చనిపోయినా.. ఈనాటికీ ఆయన అమలు చేసిన ప్రభుత్వ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని గుర్తుగా నిలిచిపోయారు. ఆయన తర్వాత ఆయన కొడుకుగా మా జగనన్న ఈరోజు రాష్ట్రప్రజల గుండెల్లో అంతటి గౌరవాన్ని దక్కించుకున్నారు. చంద్రబాబు లాంటి నీచమైన కుట్రల మూలంగా 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఒంటిచేత్తో పార్టీ పెట్టి అధికారంలోకొచ్చి ముఖ్యమంత్రి అయిన జగనన్న అందరికీ ఆదర్శనీయమైన రాజకీయనేతగా చెప్పుకోవాలి.

ఎక్కడ పోటీచేసినా.. రాక్షసచౌదరికి బుద్ధిచెబుతాం..
ఆదేశిస్తే ఆంధ్రాలో ఎక్కడ్నుంచైనా పోటీచేసి గెలుస్తానని ప్రగల్భాలు పలికే రేణుకాచౌదరికి నేను ఒక సవాల్‌ విసురుతున్నాను. రేపు జరగబోయేది ప్రగల్భాలను నమ్మి ఓట్లేసే 1994 నాటి ఎన్నికలు కాదు. ఇవి 2024 ఎన్నికలు. వార్‌వన్‌సైడ్‌ ఎన్నికలు. మా జగనన్న నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ హవా చూపెట్టే ఎన్నికలు. రేణుకాచౌదరి పేరును కాస్తా రాక్షసచౌదరిగా మార్చుకున్న నువ్వు ఆంధ్రాలో ఎక్కడ పోటీచేస్తావో.. నేనూ చూస్తా.. దమ్ముంటే నువ్వు చెబుతున్న విజయవాడలో పోటీచేస్తావో.. గుడివాడలో పోటీకి దిగుతావో.. నీ కోసం మేం ఇక్కడ ఎదురుచూస్తున్నాం..

రేణుకా మెంటల్‌కు ఆరోగ్యశ్రీలో పెట్టి చికిత్సచేయిస్తాం..
ఒకప్పుడు రాజ్యసభలో ప్రధాని మోదీగారు ఆధార్‌కార్డు గురించి మాట్లాడుతుండగా.. రేణుకాచౌదరి చేసిన వికటట్టహాసానికి అప్పటి చైర్మన్‌గా ఉన్న వెంకయ్యనాయుడు ఆగ్రహించిన సంగతి అందరూ తెలుసుకోవాలి. అప్పట్లో ఆయన రేణుకాచౌదరిని ఉద్దేశించి.. ‘నీకేమైనా ప్రాబ్లం ఉందేమో.. డాక్టర్‌ను సంప్రదించి చూయించుకో..’ అన్నారు. ‘ఇంతకు ముందెన్నడూ ఇంత రాక్షసమొఖాన్ని చూడలేదు’ అని స్వయాన ప్రధాని మోదీనే అన్నారు. అంటే, ఈమె రాక్షస చేష్టలు అంత జుగుప్సాకరంగా ఉంటాయని తెలుస్తుంది. అప్పట్నుంచి ఆమె డాక్టర్‌ను కలవలేకపోయినా.. ఈరోజు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న రేణుకా చౌదరి మెంటల్‌ స్టేటస్‌కు ఈ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీలో చికిత్స చేయిస్తాం.

సంస్కారం గలిగిన నాయకుడు మా జగనన్న
పేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలో ముందున్న మా జగనన్న ‘నవరత్నాలు’ పథకాలతో ప్రపంచగుర్తింపు పొందుతున్నారు. ఈరోజు ఆంధ్రలో అమలయ్యే ప్రతీ ప్రభుత్వ పథకాన్ని మిగతా రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తి చూపుతున్నారు. అటువంటి పరిపాలనాధ్యక్షుడిపై అవాకులు చెవాకులు పేలుతూ.. ఏకవచనంతో సంభోదించడాన్ని మేం ఖండిస్తున్నాం.
మేము కూడా రేణుకాచౌదరిని ఏకవచనంతో పిలవగలం. కానీ, మాకు సంస్కారం అడ్డొస్తుంది. రేణుకాచౌదరి, ఆమె బెస్ట్‌ఫ్రెండ్‌ చంద్రబాబు కలిసి మా జగనన్నపై ఏమాత్రం నోరుజారినా.. మీకు బడితెపూజ చేసి మూలన కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది తెలుసుకోవాలి.

Leave a Reply