Suryaa.co.in

Andhra Pradesh

గ్లోబల్ సమ్మిట్ వైసీపీ గ్లోబల్ ప్రచారం చేసుకోవడానికి తప్ప విశాఖకు ఉపయోగం లేదు

-భూకభ్జాలు, గంజాయి మాఫియాతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ జగన్ దెబ్బతీశారు
– తెలుగునాడు విధ్యార్ది విభాగం (టీ.ఎన్.ఎస్ ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్

గ్లోబల్ సమ్మిట్ పేరుతో రాష్ట్రంలో ఏదో అద్బుతం జరుగుతుందన్నట్టు వైసీపీ నేతలు హడావుడి చేయటం సిగ్గుచేటు. గ్లోబల్ సమ్మిట్ వైసీపీ గ్లోబల్ ప్రచారం చేసుకోవటానికి తప్ప దాని వల్ల విశాఖకు గానీ, రాష్ట్రానికి గానీ రూపాయి ఉపయోగం లేదు. నాలుగేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో సేదదీరుతున్న జగన్ రెడ్డి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గ్లోబల్ సమ్మిట్ పేరుతో విశాఖలో వీధి నాటకాలకు తెరతీశారు.

నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఉత్తరాంధ్రకు ఎన్ని పరిశ్రమలు తెచ్చారో జగన్ చెప్పాలి? కొత్తగా ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా టీడీపీ హయాంలో వచ్చిన రూ. 17 లక్షల కోట్ల పెట్టుబడుల్ని వెళ్లగొట్టి యువతకు ఉపాధి లేకుండా చేశారు. భూకభ్జాలు, గంజాయి మాఫియాతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు.

యూనివర్సిటీలు, కాలేజీల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నా ఎలాంటి చర్యలు లేవు. రుషికొండను తవ్వేసి పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టారు. 3 రాజధానుల పేరుతో ప్రజల మద్య ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టి చలికాచుకోవాలంటుకున్న జగన్ కి బుద్ది చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్దంగా ఉన్నారు.

LEAVE A RESPONSE