యువగళం దెబ్బకు నిద్ర కరువై కొత్త డ్రామాకు తెర లేపిన జగన్ అండ్ కో

• విశాఖ సమ్మిట్ పేరిట వైసీపీ నేతల హడావిడి
– ముఖ్యమంత్రికి కనీసం డిగ్రీ లేదు
– గ్రాడ్యుయేషన్ ఓటు వేసుకొనే అవకాశం కూడా లేదు
• తెలుగుయువత అధికార ప్రతినిధి సజ్జా అజయ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో జగన్ అండ్‌కో కు నిద్ర కరువై, విశాఖ వేదికగా మరోసారి కొత్త డ్రామాకు తెరతీశారని తెలుగుయువత అధికార ప్రతినిధి సజ్జా అజయ్ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్ నుంచి మీడియతో మాట్లాడిన ఆయన… పారిశ్రామిక సదస్సుల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదన్నారు.

నాలుగేళ్ళుగా రాష్ట్రంలో పారిశ్రామికరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా ఉన్న పారిశ్రామికవేత్తలను తరిమికొట్టిన జగన్ సర్కార్… ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం హస్యాస్పదమన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి పారిశ్రామికవేత్తలను అన్నివిధాలుగా వేధించి ఇప్పుడు సమ్మిట్ పెట్టడం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, వచ్చే ఎన్నికల్లో ప్రజల్ని మభ్య పెట్టేందుకేనన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలని కోరారు.

లోకేష్ తన పాదయాత్రలో భాగంగా నిర్వహించే ’సెల్ఫీ విత్ లోకేష్‘ కార్యక్రమానికి ప్రజల నుంచి అనుహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. 2014 నుండి 2019 వరకు తెచ్చిన పరిశ్రమలను లోకేశ్ చూపించి సవాల్ విసురుతుంటే సమాధానం చెప్పుకోలేని వైసీపీ నేతలు… టీడీపీపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. 10 లక్షల ఉద్యోగాలను ప్రైవేటు రంగంలో కల్పించిన ఘనత నారా చంద్రబాబునాయుడు, నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీది. ఈ నాలుగు సంవత్సరాల జగన్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎన్ని పెట్టుబడులు తెచ్చారో? బహిరంగ చర్చకు రావాలి.

పెట్టుబడిదారులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు ఉన్నాయా?
విశాఖలో జరిగే సమ్మిట్‌లో ఏం ముఖం పెట్టుకుని పెట్టబడుదారుల్ని ఆహ్వానిస్తారు? రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, చంద్రబాబు, దుష్టచతుష్టయంతోటి యుద్ధం చేస్తున్నాను అని చెబుతుంటే నమ్మేందుకు అక్కడ ఎవరు సిద్ధంగా లేరన్నారు. పెట్టుబడిదారులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు ఉన్నాయా?

ముఖ్యమంత్రికి కనీసం డిగ్రీ లేదు, గ్రాడ్యుయేషన్ ఓటు వేసుకొనే అవకాశం కూడా లేదు. గుడివాడ అమర్నాథ్ రెడ్డిని అడిగిన ప్రశ్నలకు కోడి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు పొదగాలి, పిల్లలవ్వాలి అని మాట్లాడి రాష్ట్ర పరువు తీయాలని సమ్మిట్ పెట్టారా? అని అజయ్ నిలదీశారు. జగన్ పాదయాత్రకేమో మైకులు, సౌండ్ బాక్సులు కావాలి, లోకేశ్ పాదయాత్రకేమో మైకులు అవసరంలేదు.

రాష్ట్ర ప్రజల తలరాతల్ని మార్చాలనే గొప్ప సంకల్పంతో లోకేశ్ అడుగులు ముందుకేస్తున్నాడు. నాలుగు సంవత్సరాలలో చేసిన సంక్షేమమేటో వైసీపీ నేతలు ప్రజలకు తెలపాలి. మీరు గడప గడపకు ప్రభుత్వం అని నడుస్తున్న రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసినవేనన్న విషయం గుర్తించాలి. దిగజారుడు మాటలు, దిగజారుడు రాజకీయం లోకేశ్‌కు తెలియవు. వచ్చే ఎన్నికల్లో నన్నెవరూ ఆపలేరు, నేను భయపడేది లేదంటు బహిరంగ సభల్లో చెబుతున్న జగన్… పైకి మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించడం తప్ప సాధించేదేమి లేదన్నారు.

లోకేశ్ ఒక దమ్మున్న నాయకుడు. జగన్ ఓ చెంచల్ గూడ జైలుపక్షి… 2024 తరువాత జగన్ చెంచల్ గూడాకు వెళ్లి సెల్ఫీలు తీసుకోవాల్సిందే. ప్రతి తెలుగువాడు మిమ్మల్ని సాగనంపడానికి కంకణం కట్టుకొని ఉన్నాడు. జగన్.. నీ టైమ్ అయిపోంది. ప్యాక్ చేసుకొని ఎంత దూరం పారిపోతావో పారిపో. 151 మంది కూడా బ్యాగులు సర్దుకొని సిద్ధంగా ఉండండని సజ్జా అజయ్ స్పష్టం చేశారు.

Leave a Reply