పార్టీ నేతలు, కార్యకర్తలను ప్రత్యేకంగా తెలుసుకోవడానికే ఆత్మీయ సమ్మేళనాలు

– ఆత్మీయ సమ్మేళనాల పై పార్టీ ముఖ్య నేతలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష

పార్టీ శ్రేణులను ప్రత్యేకంగా కలుసుకొని వారితో మాట్లాడి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు ఇంకా జరగాల్సిన పురోగతిపై చర్చించి, సమస్యలను పరిష్కరించడానికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణులనుంచే కాక ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తున్నట్లు ఆయన వివరించారు. పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి మండలంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఇప్పటివరకు పాలకుర్తి నియోజకవర్గం లో నిర్వహించిన పలు ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణుల నుంచి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు చెప్పారు. త్వరలో పాలకుర్తి మండలం లో నిర్వహించనున్న టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు చేయాల్సిన ఏర్పాట్లపై, నిర్వహించాల్సిన గ్రామాలపై, అలాగే సమ్మేళనాలు నిర్వహించే పద్ధతిపై మంత్రి ఎర్రబెల్లి పార్టీ ముఖ్య నాయకులకు వివరించారు.

పెద్ద గ్రామాలైతే ఒకటి రెండు గ్రామాలకు మించకుండా సమావేశాలు నిర్వహించాలని ఒకవేళ చిన్న గ్రామాలు ఉంటే మూడు నుంచి నాలుగు గ్రామాల వరకు ఎంపిక చేసుకుని ఏదో ఒక గ్రామంలో ఈ సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ బాధ్యులు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అలాగే పార్టీకి చెందిన అనుబంధ సంఘాల నాయకులు మొదలగు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా మంత్రి తెలిపారు. ఆసక్తిగా వచ్చే ప్రజలను అనుమతించాలని, ఆరోజు భోజనాలు వడ్డించి అందర్నీ ఆత్మీయంగా పలకరించుకోవాలని మంత్రి వివరించారు.

Leave a Reply