– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ రాంచందర్ రావు నాయకత్వంలో, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు నగరంలోని పార్టీ కార్పొరేటర్లు, నగర అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి, వారితో చర్చించడమైంది.
ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక సందర్భంగా కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ తో కలిసి రాంచందర్ రావు సమాలోచనలు నిర్వహించి, అభ్యర్థి ఎంపికపై కేంద్ర పార్టీకి నివేదించారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా డా. ఎన్. గౌతమ్ రావు ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలోని 84 కార్పొరేటర్ అభ్యర్థులు, 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, నలుగురు పార్లమెంటు సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు కలుపుకొని సుమారు 117 మంది ఓటర్లు ఈ ఎన్నికలో పాల్గొంటారు.
మొదటి నుంచి అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చురుగ్గా పాల్గొని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 30 ఏళ్లు ఏబీవీపీ లో పనిచేస్తూ, గత 15 ఏళ్లుగా బిజెపిలో పనిచేస్తూ, భాగ్యనగర సంఘటన సహ మంత్రిగా, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా గౌతంరావు సేవలందించారు.
పార్టీ పేరులోనే మతాన్ని ఉంచుకున్న ఎంఐఎం పార్టీ ప్రజావ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా బిజెపి మొదటి నుంచి నిరంతర పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో వత్తాసు పలికి అంటకాగడం ఎంఐఎంకు పరిపాటే. సంతుష్టీకరణ రాజకీయాలకు తలవంచేలా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు ఇస్తోంది.
నిజాం పాలనలో ఫైర్ సర్వీస్ స్టేషన్‌గా ఉన్న భవనం, కాంగ్రెస్ హయాంలో ఎంఐఎంకు మద్దతు తెలిపే చర్యల కారణంగా, దారుస్సలాం కేంద్రంగా మారింది. 1978లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పాలనలో, హైదరాబాద్‌లో రమిజాబీ అనే మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రోజుల పాటు కర్ఫ్యూ విధించబడింది. ఆ సమయంలో ఎంఐఎం దారుస్సలాం ప్రాపర్టీ కేసును తీసుకువచ్చి, కర్ఫ్యూ ఎత్తివేసే ఒప్పందంగా ఉపయోగించుకుంది.
చెన్నా రెడ్డి హయాంలో మతోన్మాద ఎంఐఎం పార్టీ దారుస్సలాం ప్రాపర్టీ కేసుపై ఒత్తిడి తీసుకురావడంతో కేసు ఉపసంహరించబడింది. పీవీ నరసింహారావు హయాంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎంఐఎం వ్యవహరించగా, దక్కన్ మెడికల్ కాలేజ్‌ను 100 ఫీట్ల నుంచి 150 ఫీట్ల వరకూ విస్తరించుకునేలా చర్యలు జరిగాయి. ఎంఐఎం పార్టీ బ్లాక్ మెయిలింగ్ విధానాల ద్వారా అనేక అక్రమాలకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి.
గత మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోకరీంనగర్-నిజామాబాద్-అదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి, మిగతా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా విరమించుకుంది.
కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో స్వయంగా ముఖ్యమంత్రి సహా మంత్రులు ప్రచారం చేసినా, ప్రజలు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బిజెపి ని గెలిపించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి భయపడి కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్ల సంతుష్టీకరణ రాజకీయాల నేపథ్యంలో మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడం లేదన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది.
రాజ్యసభలో నిన్నటి వరకు వక్ఫ్ బోర్డు బిల్లుపై చర్చ జరిగింది. ముస్లిం మైనారిటీల్లో పేద ముస్లింలకు వక్ఫ్ ఆస్తులు అందేలా నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం చెందే ప్రక్రియలో తెలంగాణకు చెందిన 8 మంది బిజెపి పార్లమెంట్ సభ్యులు కీలక భాగస్వామ్యం వహించారు.
370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ బోర్డు బిల్లు వంటి చారిత్రక నిర్ణయాల్లో తెలంగాణ బిజెపి ఎంపీలు కీలకంగా పాల్గొన్నారు. ఇది తెలంగాణ ప్రజల అదృష్టంగా భావించాల్సిన విషయం.
మతోన్మాద మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలందరూ ఒక్కటవ్వాలి. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల కోసం రాజకీయాలు చేసే పార్టీలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం కొనసాగుతుంది. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని కోరుతున్నాం. ఏప్రిల్ 23న జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డా. ఎన్. గౌతమ్ రావు ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ ఐక్యతకు కట్టుబడి ఉన్న భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని కోరుతున్నాం.