జర్నలిస్టుల సమస్యలపై ఆగస్ట్ లో ఉద్యమానికి సిద్ధంకండి !

ఏ.పి.యు.డబ్ల్యు.జే. నేతలపిలుపు !

ఏలూరు ,జూలై 10 : రాష్ట్రంలో మూడేళ్ళుగా అపరిష్కృతంగా పడిఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్ట్ నెలలో ప్రారంభించనున్న ఉద్యమానికి సంసిద్ధం కావాలని ఐ.జే.యు. , ఏ.పి.యు.డబ్ల్యు.జే. నేతలు పిలుపు ఇచ్చారు ! ఏ.పి.యు.డబ్ల్యు.జే. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జూలై 10 వ తేదీన ఏలూరు అతిధి కాన్ఫరెన్స్ హాలులో జరిగింది ! జిల్లాఅధ్యక్షుడు జి.వి.ఎస్.ఎన్.రాజు అధ్యక్షత వహించారు!

ఐ.జే.యు. జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గసభ్యుడు డి.సోమసుందర్ , ఏ.పి.యు.డబ్ల్యు.జే. అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు , ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఉపాధ్యక్షుడు కే.మాణిక్యరావు , కోశాధికారి ఏ.వి.శ్రీనివాసరావు , పాల్గొని ప్రసంగించారు!

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ గత రెండేళ్ళుగా చేసిన ప్రయత్నాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వారు వివరించారు ! సమస్యలన్నీ పేరుకుపోయాయనీ , గతంలో అమల్లో ఉన్న సదుపాయాలను కూడా జర్నలిస్టులు కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు! కరోనా వంటి తీవ్ర ప్రతికూల వాతావరణంలో కూడా యూనియన్ సభ్యుల ఆరోగ్యం కోసం , సంక్షేమంకోసం తీవ్ర కృషి చేసిందని వారు గుర్తు చేశారు ! రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళనాని ఈ విషయంలో ఎంతో సహకారం అందించారని వారు కృతజ్ఞతలు తెలిపారు ! మంత్రి పిఆర్వోగా పనిచేసిన యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. మాణిక్యారావు రాష్ట్రవ్యాప్తంగా అందించిన సేవలను వారు ప్రశంసించారు ! అయితే జర్నలిస్టుల హక్కులు ,సంక్షేమం విషయంలో యూనియన్ ఎంతగా ప్రయత్నించినా ప్రభుత్వం నుండి ఆశించిన స్పందన రాలేదని , వారు పేర్కొన్నారు !

అందుకే ఆగస్ట్ లో రాష్ట్రవ్యాప్త ఆందోళన తలపెట్టామని ,అందుకు జర్నలిస్టులు సంసిద్ధం కావాలని నాయకులు పిలుపు ఇచ్చారు ! ఈలోగా సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలని కోరారు ! కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో యూనియన్ కు సంబంధించి జిల్లా శాఖల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు ! ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు ! జూలై 31లోగా సభ్యత్వ పునరుద్ధరణ పూర్తిచేసి ఆగస్ట్ లో జిల్లాల మహాసభలు పూర్తి చేయాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందని నాయకులు తెలిపారు!

జిల్లానాయకులు వై.గిరిజాపతి, (భీమవరం) వై.మురళీకృష్ణ (తాడేపల్లిగూడెం) , పిటి వెంకటేశ్వరరావు (పాలకొల్లు), వాసా సత్యనారాయణ, (జంగారెడ్డిగూడెం) కే.కృష్ణ (తణుకు), రాజేష్ (ఏలూరు) వై. మోజస్ (కైకలూరు) , జి. ఉదయభాస్కర్ (నూజివీడు) , సురేష్ (కొవ్వూరు), జీ. ఉదయభాస్కర్ ( యలమంచిలి ), బి.మురళీధర్ (ఏలూరు), టి. పుల్లారావు ( గణపవరం) , జవ్వాది పృధ్వీరాజ్ ,(నిడదవోలు) తదితరులు మాట్లాడారు ! సమావేశంలో బాపట్ల జిల్లా నాయకులు సి.హెచ్.రాంబాబు , కృష్ణాజిల్లా అర్బన్ నాయకులు నాగరాజు , పాల్గొన్నారు !

సమావేశానికి ఎస్.శ్రీనివాసరావు ,పి.సురేష్ , ఏ.రాంబాబు (కైకలూరు), టి. ఇజ్రాయెల్ ,(నరసాపురం), డి.వి.భాస్కరరావు , డి.వి.ఎల్. ఎన్.స్వామి , కే. సాయిబాబా,(జంగారెడ్డిగూడెం), జక్కుల దాసు (బుట్టాయిగుడెం), వి.మధు , రియాజ్ , డి. విజయకుమార్, ఎం. భరత్ , ఎస్. సంజయ్ , యు. శ్రీనివాస్ , జి.వి .ప్రసాద్ , బి.భరత్ కుమార్ , రాజు , ప్రదీప్ ,(ఏలూరు) తదితరులు హాజరయ్యారు !

15 మంది సభ్యులతో ఏలూరు జిల్లా కన్వినింగ్ కమిటీ ఏర్పడింది!
కన్వీనర్ గా జివిఎస్ఎన్ రాజు ను ఎన్నుకున్నారు!
17 మంది సభ్యులతో పశ్చిమగోదావరి జిల్లా కన్వీనింగ్ కమిటీ ఏర్పడింది!
కన్వీనర్ గా గజపతి వరప్రసాద్ ఎన్నికయ్యారు!
జూలై నెలాఖరులోగా సభ్యత్వ ప్రక్రియ పూర్తిచేసి ,ఆగస్ట్ లో మహాసభ జరిపే బాధ్యతను ఈ కన్వీనింగ్ కమిటీలకు అప్పగిస్తూ సమావేశం నిర్ణయించింది జి.వి.ఎస్.ఎన్. రాజు వందన సమర్పణతో సమావేశం ముగిసింది !

Leave a Reply