Suryaa.co.in

Telangana

కంటోన్మెంట్ ప్రజలకు జీహెచ్ఎంసీ ‘ఫ్రీ వాటర్ స్కీం’ అమలు చేయాలి

-సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబెర్ జే.రామకృష్ణ డిమాండ్

సికింద్రాబాద్, జనవరి 28 : కంటోన్మెంట్ ప్రజలకు జీహెచ్ఎంసీ ‘ఫ్రీ వాటర్ స్కీం’ అమలు చేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబెర్ జే.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ 2019లో జీహెచ్ఎంసీ తీసుకు వచ్చిన ఉచిత మంచినీటి పథకంలో కంటోన్మెంట్ పేరు లేకపోవడం దారుణం అన్నారు.

కంటోన్మెంట్ కు సొంతంగా నీటి వనరులు లేకపోవడంతో కావాల్సిన స్థాయిలో ప్రజలకు నీటి సరఫరా అందించలేక పోతున్నామన్నారు. ఇందుకోసం మెట్రో వాటర్ సప్లై నుంచి కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఇందుకు మెట్రో వాటర్ వర్క్స్ కు రూ.1.10 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజలకు డబుల్ రేట్ కు మంచినీరు సరఫరా చేస్తుందన్నారు. కాబినెట్ సబ్ కమిటీ స్థాయిలో మీటింగ్ జరిగినా ఏ నాయకుడు పట్టించుకోలేదు. కంటోన్మెంట్ ప్రజలు తెలంగాణలో భాగమే అన్న కనికరం టీఅర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు.

గత 20 సంవత్సరాలనుండి పోరాటాలు చేసి గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. గురువారం వాదోపవాదాలు విన్న కోర్టు దీనిపై రెండు వరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. కంటోన్మెంట్ కు ప్రభుత్వం బాకీ ఉన్న రూ.90 కోట్లు వెంటనే చెల్లించని పక్షంలో కోర్టుకు ఆశ్రయిస్తామన్నారు. జీవితాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ కలవాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ప్రస్థావించడం హాస్యాస్పదం అన్నారు.

LEAVE A RESPONSE