Suryaa.co.in

Andhra Pradesh

పేరుకు 42 మంది విద్యార్ధులు.. కానీ ఉండేది ముగ్గురే!

– మధ్యాహ్న భోజనంలో మాత్రం 25 మందికి హాజరు
– గిద్దలూరు సీసీ హైస్కూలులో ఇదో వైచిత్రి

ఆ స్కూల్లో ప్రతిరోజు 42 మంది విద్యార్థులు హాజరవుతారు కానీ ఉండేది మాత్రం ముగ్గురు విద్యార్థులు. మధ్యాహ్నం భోజనం 25 మందికి రికార్డులో నమోదు. గిద్దలూరు సీ. సీ హైస్కూల్లో గురువారం మధ్యాహ్నం ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. రోల్ 42 కాగా 38 మందికి హాజరు వేశారు…25 మంది మధ్యాహ్నం భోజనం చేసినట్లు చూపారు. క్లాసులో ఉన్నది ముగ్గురు విద్యార్థులు మాత్రమే.

LEAVE A RESPONSE