– రాజస్థాన్ అసెంబ్లీకి మాజీ ఉపరాష్ట్రపతి ధన్కడ్ దరఖాస్తు
ఢిల్లీ: రాజస్థాన్ మాజీ శాసనసభ్యుడిగా తనకు రావాల్సిన పెన్షన్ కోసం మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అప్లికేషన్ రాజస్థాన్ అసెంబ్లీ సెక్రటేరియట్ పరిశీలనకు స్వీకరించింది.
ఈ విషయాన్ని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవనాని ధ్రువీకరించారు. ధన్ఖడ్ నుంచి దరఖాస్తు అందిందని, నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియను ప్రారంభించామని ఆయన తెలిపారు. లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయనకు పెన్షన్ మంజూరు అవుతుందని వివరించారు.
రాజస్థాన్ నిబంధనల ప్రకారం, మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ. 35,000 పెన్షన్ లభిస్తుంది. 70 ఏళ్లు దాటిన వారికి 20 శాతం, 80 ఏళ్లు దాటిన వారికి 30 శాతం అదనంగా ఇస్తారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న జగదీప్ ధన్ఖడ్కు 20 శాతం అదనపు ప్రయోజనం వర్తిస్తుంది. దీంతో ఆయనకు నెలకు సుమారు రూ. 42,000 పెన్షన్ అందనుంది.