Suryaa.co.in

Andhra Pradesh

24 గంటల సమయం ఇస్తున్నా..నా పై చేసిన ఆరోపణల్లో ఆధారాలు వైసిపి బయటపెట్టాలి

– ట్విట్టర్ లో జగన్ రెడ్డి కి, తనపై ఆరోపణలు చేస్తున్న వైసిపి నాయకులకు 24 గంటల ఛాలెంజ్ విసిరిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
– స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి తన పై చేస్తున్న ఆరోపణల పై దమ్ముంటే 24 గంటల్లో ఆధారాలు బయటపెట్టాలని ఛాలెంజ్ విసిరిన లోకేష్

ఆరోపణలు చేసి పారిపోవడం వైసిపి నేతలకు అలవాటు.వైసిపి నేతలు మాదిరిగా అందరూ అవినీతి పరులే అని ప్రజల్ని మభ్య పెట్టడానికే బురద జల్లే కార్యక్రమం.మీరు అధికారం లోకి వచ్చి మూడు ఏళ్ల 8 నెలలు అయ్యింది.మీరు చెయ్యని విచారణ లేదు. నాతో పాటు చంద్రబాబు గారి పై చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదని తేలిపోయింది.మేము మీలానే అవినీతి కి పాల్పడి చిప్పకూడు తింటాం అనుకోవడం మీ అవివేకం.

ఇన్సైడర్ ట్రేడింగ్ , ఫైబర్ గ్రిడ్, ఐటి కంపెనీలు రాయితీలు, ఇలా అనేక విషయాల్లో నా పై అవినీతి బురద జల్లారు.ఒక్క ఆరోపణలో కూడా ఆధారాలు చూపలేక పారిపోయారు. ఆఖరికి చంద్రబాబు గారిపై మీరు ఎంతో అల్లరి చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా కోర్టు కొట్టేసింది.జగన్ రెడ్డి కి పాలన చేతగాక ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న వేళ మరోసారి ప్రజల దృష్టి ని మరల్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి అంటూ నా పై కొత్త ఆరోపణలు మొదలు పెట్టారు.

వైసిపి నా పై చేస్తున్న అన్ని ఆరోపణలు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నేను రెడీ.24 గంటల సమయం ఇస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ తో సహా నా పై చేసిన ఆరోపణల్లో ఆధారాలు వైసిపి బయటపెట్టాలి. ఆధారాలు బయటపెడతారో, ప్యాలెస్ పిల్లితో పాటు వైసిపి పిల్లులు పారిపోతాయో 24 గంటలు వేచి చూద్దాం.

LEAVE A RESPONSE