సర్వ మానవాళి పాప విముక్తి కోసం ప్రభువైన యేసు శుక్రవారం రోజున చనిపోయాడు, విశ్వంలోని సర్వమానవాళి పాపం యొక్క ఫలితం గా వచ్చిన శిక్ష యావత్తు తన మీద వేసుకుని, తను శ్రమ పొంది ప్రపంచ మానవాళికి పాప విముక్తి ప్రసాదించాడు ఏసుప్రభు.
ఏసుప్రభు దేవుడు గనుక ఆయన ఘోరమైన శిలువ మరణాన్ని తప్పించుకోగలడు కానీ తప్పించుకోలేదు , ఎందుకంటే ఆయన తప్పించుకుంటే సర్వ మానవాళికి పాప విముక్తి లేదు, ఆయన శిలువేయబడే సమయములో తనకున్న శిష్యులందరూ పారిపోయారు, ఒక శిష్యుడు ఇసుకరియేతి యోధ తనను మతఛాందస్వాదులకు అప్పగించాడు. ఆయన బ్రతికి ఉన్న దినములలో ఎంతో మందికి మేలు చేశాడు.
గుడ్డి వాళ్లకి కళ్ళు చూపు పొందేటట్టు చేశాడు, చెవిటి వారికి వినబడేటట్టు అద్భుతం చేశాడు, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు, ఇలా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన బ్రతికిన 33½ సంవత్సరాల లో ఒక్క తప్పు గాని ఒక్క అబద్ధం గాని ఇతరులకు హాని గాని ఎక్కడా తలపెట్టలేదు కాబట్టే ఏసుప్రభుకు కర్మ పాపం లేదు, ఏసుప్రభుకు జన్మ పాపం ఎందుకు లేదంటే, ఆయన దేవుడి శక్తి వల్ల, పెండ్లి కానీ కన్య అయిన, భక్తి కలిగిన మరియ గర్భం దాల్చటం వలన ఏసుప్రభు జన్మించాడు.
ఏసుప్రభు తన దైవ శక్తిని ఉపయోగించుకోకుండా సాధారణ మనిషి లాగానే సిలువ మరణానికి అప్పగించుకున్నాడు, శిలువ మరణానికి ముందు ప్రార్థిస్తున్నప్పుడు ఎంత ఒత్తిడికి లోనయ్యాడంటే, గెత్సెమనే తోటలో తన చెమట తన రక్తం బిందువుల్లాగా బయటకు వచ్చింది.
సర్వ మానవాళి పాపం తన మీద వేసుకున్నాడు కాబట్టి పరిశుద్ధుడైన యేసు ఒక ఘోరమైన పాపిగా మారిపోయాడు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, హేళన చేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు, కొరడా చివర ముల్లులు ఉంటాయి, ఒక్క కొరడా దెబ్బ కొడితే ఆ గాలములను శరీరానికి గుచ్చుకొని మాంసం లాగేస్తాయి, రూపం లేకుండా మారిపోయాడు,
ముళ్ళుతో కిరీటం లాగల్లి నొచ్చట మీద గుచ్చారు దానికి తల్లడిల్లిపోయాడు, బరువైన శిలువను ఆయన మీద ఉంచి శిలువ వేసే చోటకి ఆయనను కొట్టుకుంటూ తీసుకువెళ్లాడు వెళ్లారు, రెండు చేతుల్లోనూ రెండు మేకులు కొట్టి కాళ్లు ఒక దాని మీద ఒకటి పెట్టి ఒక మేకు కొట్టి ఆయన్ని ఘోరంగా శిలువ వేశారు .
శిలువ మీద ఐఎన్ఆర్ఐ(INRI) అని రాసి సిలువకు కొట్టారు దాని అర్థం “Iesus Nazarenus rex Iudaeorum”. ఇది లాటిన్ భాషలో ఉంటుంది. దీనికి తెలుగులో అర్థం “నజరేయుడైన ఏసు యూదులకు రాజు”అని. ఇంగ్లీషులో దీనికి అర్థము “Jesus of Nazareth, king of the Jews.”
సిలువ లోంచి ఏసుక్రీస్తు పలికిన ఏడు మాటలు
1. తనును హింసించిన వారిని క్షమించాడు
2. ఆ టైంలో తన పక్కన శిలువ వేయబడిన దొంగ, క్షమించు ప్రభువా అని ప్రచ్ఛత్తాప పడిన దానికి, ఏసుక్రీస్తు నిన్ను క్షమిస్తున్నాను ఇప్పుడే నాతో కూడా పరలోకం వస్తావు అన్నాడు.
3. సిలువ మీద నుంచి తన తల్లిని చూసి, తన తల్లి బాధ్యతలు, తన శిష్యుడైన యోహానుకి అప్పగించాడు.
4. నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడవు అన్నాడు
5. తన రక్తమంతా కారిపోవడం వలన నేను దప్పికొనుచున్నాను అన్నాడు.
6. సర్వ మానవాళి పాప విమోచన కార్యక్రమం సమాప్తమైనది అన్నాడు.
7. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు.
ఏసుప్రభు తన ప్రాణం విడిచిన తరువాత, శిష్యులు అధికారులను అడిగి మరణించిన ఏసుప్రభు శరీరమును సిలువ మీద నుంచి దించి తెల్లని బట్ట చుట్టి, రాతి సమాధిలో ఉంచారు. దాని తర్వాత మత ఛాందసవాదులు చక్రవర్తిని చెప్పి, ఆ సమాధిని భద్రం చేయమని సైనికులను కాపల ఉంచారు.
ఏసుప్రభు కి ఘోరమైన బాధ కలిగించిన శుక్రవారం ఎందుకు మంచి శుక్రవారం అని పిలవబడింది అంటే, ఆయనకు బాధే గాని, ఆయన బాధ సర్వ మానవాళికి పాప విముక్తి ప్రసాదించినందువలన సర్వ మానవాళికి ఆరోజు మంచి శుక్రవారం అయ్యింది. మరణించిన మూడవరోజు ఏమైందో ఈస్టర్ రోజు తెలుసుకొనవచ్చు.
ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ ప్రకాష్ మోసిగంటి,
B.Tech, M.Tech, Ph.D
చైర్మన్, Jesus Believers Association Council (JBAC)
మాజీ డైరెక్టర్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజెస్, గుంటూరు