సముద్రంలో కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం

రష్యాకు చెందిన ఓ యుద్ధవిమానం ఉక్రెయిన్ సమీపంలోని క్రిమియా ద్వీపకల్పం వద్ద కుప్పకూలింది. ఈ మేరకు సెవస్టొపోల్ గవర్నర్ మిఖైల్ రాజ్వోజైవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. ‘పైలట్ ఎజెక్ట్ అయ్యారు. అతడిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రాణానికేం ప్రమాదం లేదు’ అని స్పష్టం చేశారు. మంటల్లో మండుతూ ఆ విమానం కుప్పకూలుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Leave a Reply