Suryaa.co.in

Telangana

అత్యంత ప్రతిభావంతుడికి మంచి అవకాశం

-డాక్టర్ సుధాకర్ రావు అనుభవం ఆరోగ్యశ్రీ కి అవసరం
-దగ్గరుండి పదవి ప్రమాణం చేయించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఎంపీ పసునూరి దయాకర్
-హాజరైన అనేకమంది అభిమానులు ఆత్మీయులు
-సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు
-ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్. సుధాకర్ రావు

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ డాక్టర్ ఎన్. సుధాకర్ రావు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మెన్ గా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తో కలిసి హాజరవ్వగా వారి సమక్షంలో డా.సుధాకర్ రావు పదవీ స్వీకారం & బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ….డా.ఎన్ సుధాకర్ రావు లాంటి అత్యంత ప్రతిభావంతుడికి మంచి అవకాశం సీఎం కెసిఆర్ గారు కల్పించారని వారికి తన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ సుధాకర్ రావు లాంటి అనుభవం గల వ్యక్తి ఆరోగ్యశ్రీ కి అవసరం అని అన్నారు. వీరి సేవలు ప్రజలకు చాలా అవసరం వుందన్నారు.

సుధాకర్ రావు గారు ఎమ్మెల్యే గా వున్నప్పుడు ఆ పదవికే వన్నె తెచ్చారు అన్నారు. వారి లాంటి ప్రతిభావంతుడు పాలకుర్తి నియోజకవర్గం చెందిన వారు కావడం అభినందనీయం అన్నారు.ఈ సందర్భంగా పాల్గొన్న ఆత్మీయులు డా. సుధాకర్ రావు ను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మీయులు, ఆరోగ్య శ్రీ సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE