తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చవటలు, దద్దమ్మలు అని సర్టిఫై చేసిన అధిష్టానం

Spread the love

– తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి మాటలు గురువింద గింజ మాదిరిగా ఉన్నాయని ఆరోపించారు. AICC మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండేసి సార్లు రెండు నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆయన తల్లి సోనియా గాంధీ యూపీ నుంచి కర్ణాటక నుంచి, రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ కూడా రెండు లోక్ సభ స్థానాల నుంచి ఎందుకు పోటీ చేశారో రేవంత్ రెడ్డి చెబితే బాగుంటుందన్నారు. వాళ్లు కూడా ఓటమి భయంతోనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారా అని ప్రశ్నించారు? కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తానని ప్రకటించగానే కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి, రేవంత్ రెడ్డికి ఎన్నికల కంటే ముందే ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే మైనారిటీ నాయకుడి మీద కేసీఆర్ ఎలా పోటీ చేస్తారంటూ కొత్త రాగం అందుకున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికలంటేనే కుల మతాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నిస్తారన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం LKG పిల్లాడిలా మైనార్టీ అభ్యర్థిపై కేసీఆర్ ఎలా పోటీ చేస్తారంటూ మాట్లాడటం ఆయన రాజకీయ అవేకానికి నిదర్శనం అన్నారు.

అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాతోనే స్పష్టమైందని సతీష్ రెడ్డి విమర్శించారు.

39 మంది సభ్యులతో CWC కార్యవర్గాన్ని ప్రకటించారని.. కానీ అందులో ఒక్క తెలంగాణ కాంగ్రెస్ నాయకుడికి కూడా స్థానం కల్పించలేదంటే.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆ పదవులకు పనికి రారనే విషయాన్ని వాళ్ల పార్టీ పెద్దలే ఒప్పుకున్నారన్నారు. దీన్ని బట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో, ఆ పార్టీ నాయకుల పరిస్థితి ఏంటో అర్థం అవుతోందని ఆయన విమర్శించారు.

ఇక్కడి నాయకులు మాటలకు తప్పితే.. చేతలకు పనికిరారని, పనికిమాలినోళ్లని, చవటలు, దద్దమ్మలని సొంత పార్టీ అధిష్టానమే సర్టిఫై చేసిందన్నారు. కనీసం పార్టీలో పదవులు తెచ్చుకోలేనోళ్లు రాష్ట్రంలో మాత్రం అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను బురిడికొట్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలే నమ్మడం లేదని.. తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. పార్టీలోని పదవులకే పనికిరాని వాళ్లు.. ప్రజలకు సేవ చేయడానికి ఏం పనికొస్తారని ఇప్పుడు తెలంగాణ సమాజంకూడా ప్రశ్నిస్తోందన్నారు సతీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఏనాడు ఆదరించలేదన్నారు. ఇకపైనా ఆదరించే పరిస్థితి లేదన్నారు.

సిట్టింగులకే సీట్లు ఇచ్చి మరోసారి బీఆర్ఎస్ విజయాన్ని కేసీఆర్ గారు కన్ఫామ్ చేయడంతో.. ఈ వాస్తవాలను పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేశారన్నారు. రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ది తెచ్చుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు.

Leave a Reply