తాత, మనవడు ఇద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు….తాతగారు అలసిపోయి పక్కనే ఉన్న బల్లపై కూర్చున్నారు…మనవడు కూడా తాత పక్కనే కూర్చుని ‘ఏదైనా చెప్పండి తాతగారూ’ అన్నాడు.
తాత కాసేపు ఆలోచించి ఇలా అన్నారు….
“స్వర్గానికి ప్రవేశం ఉచితం… నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టాలి”
మనవడు ఆశ్చర్యం గా తాత వంకచూసి…” అదెలా?” అన్నాడు.
తాత గారు నవ్వి ఇలా అన్నారు.
జూదం ఆడటానికి డబ్బు కావాలి.
మత్తుపానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి.
సిగరెట్ త్రాగడానికి డబ్బుకావాలి.
పాపాలతో పయనించడానికి డబ్బు కావాలి.
“కానీ….మనవడా….
ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు.
దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు.
సేవ చేయడానికి డబ్బు అవసరం లేదు.
ఉపవాసం ఉండి దేవునికి అత్యంత దగ్గరగా వసించడానికి డబ్బు అవసరం లేదు.
క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు.
చూపులో కరుణ,సానుభూతి చూపడానికి డబ్బు అవసరంలేదు.
మన హక్కులను పొందడానికి డబ్బు అవసరం లేదు.
అన్నింటికంటే దేవుణ్ణిపై నమ్మకం ఉండాలి.. మనపై మనకు ప్రేమ ఉండాలి…
ఇప్పుడు చెప్పు . డబ్బు ఖర్చు చేసి నరకాన్ని ఇష్టపడతావా?
ఉచితంగా లభించే స్వర్గం వైపు వెళ్తావా?…
మనవడు తాతయ్య అనుభవాలను ఆశ్చర్యం గా వింటూ..అలాగే చూస్తూ ఉండిపోయాడు.
పెద్దల మాట చద్దిమూట.