Suryaa.co.in

Andhra Pradesh

మంచితనం బానిసత్వానికి దారితీసేలా ఉండకూడదు

-సౌమ్యంగా ఉడే బీసీలను బానిసల్ని చేసేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు
-మన బీసీ కులాల అభివృద్ధికి మనమే బాటలు వేసుకోవాలి
-జగన్ రెడ్డి మోసానికి బలయ్యేందుకు బీసీలు సిద్ధంగా లేరని నిరూపించాలి
-తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి సభ్యుల శిక్షణా కార్యక్రమంలో కొల్లు రవీంద్ర

సమాజ అవసరాలు తీర్చేది బీసీలే. కానీ నిత్యం సమాజం గురించి ఆలోచించి, మన గురించి మనం ఆలోచించడం మర్చిపోయినందునే.. ఆర్ధికంగా సమాజికంగా, రాజకీయంగా వెనుకబడిపోయాం. ఎన్టీఆర్ చొరవ, రాజకీయ రిజర్వేషన్ల కారణంగా కొన్ని కులాలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేశాయి. చంద్రబాబు సాధికార సమితుల ఏర్పాటుతో అల్పసంఖ్యాకులుగా ఉన్న కులాలకు కూడా రాజకీయ ప్రాధాన్యం కల్పించే అవకాశం వచ్చింది. పంచాయతీల నుండి చట్ట సభల వరకు ప్రాధాన్యం దక్కని ప్రతి కులానికీ ఇకపై అవకాశం కల్పించే లక్ష్యంతోనే సాధికార సమితుల్ని ఏర్పాటు చేసినట్లు.. తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ *బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి‘ అధ్యక్షతన శాలివాహన, భట్రాజ, మేదర, జంగం, బొందిలి, కృష్ణ బలిజ/పూసల బలిజ సాధికార కమిటీ సభ్యుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహించారు.

ఈ మేరకు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. మధ్యలో జగన్ రెడ్డి, ఆయన తండ్రి బీసీలను టీడీపీకి దూరం చేసే కుట్ర చేసినా ఫలించలేదు. అందుకే ఇప్పుడు కులాలుగా విడగొట్టి బీసీలను మోసం చేసేందుకు జగన్ రెడ్డి సిద్ధమయ్యాడు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. రాక్షసుడిని మించిన జగన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బీసీలంతా ఏకం కావాలి. బీసీలను బానిసల్ని చేద్దామని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.

బీసీల పథకాలు రద్దు చేశాడు. వ్యాపారాలను దెబ్బతీస్తున్నాడు. ఆస్తులు స్వాధీనం చేసుకుంటూ అణచివేస్తున్నాడు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి, దాడులకు దిగి వేధిస్తున్నాడు. బీసీల ఐక్యత ఎలా ఉంటుందో.. బీసీలంతా ఏకమైతే ఎలా ఉంటుందో జగన్ రెడ్డికి చూపించాలి. తొక్కిపట్టి నారతీయాల్సిన సమయం ఆసన్నమైంది.

చంద్రబాబు విజన్ ఎలా ఉంటుందో.. నాటి విజన్ 2020 చూస్తేనే అర్ధమవుతుంది. అప్పట్లో విజన్ 2020 అంటే అందరూ నవ్వుకున్నారు. అప్పటి పాలకులు అసెంబ్లీలో వెటకారం చేశారు. కంప్యూటర్లు వడ్లు పండిస్తాయా, అన్నం పెడతాయా అన్నారు. నాడు వెటకారం చేసిన అదే విజన్ 2020 ఇప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచంలోనే రిచ్చెస్ట్ సిటీల్లో 65వ స్థానంలో నిలిపింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు విజన్ 2047 అన్నారు. ఫార్ములా పి-4తో రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు సంకల్పం తీసుకున్నారు.

చంద్రబాబు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి రాళ్లు, రప్పలతో నిండిన ప్రాంతాలను సైతం సస్యశ్యామలం చేశాడు. ఎడారి అన్న ప్రాంతాల్లో సిరులు పండించాడు. కంపెనీలు తీసుకురావడం, స్కిల్ డెవలప్ చేయడం ద్వారా స్థానిక యువతకు ఆర్ధికంగా అండగా నిలిచే అవకాశం వస్తుందని ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఆశయ సాధనలో మనం కూడా భాగస్వాములవుదాం. గ్రామస్థాయిలో బీసీ కులాల్లోని సమస్యలు గుర్తించి, వారిని ఆదుకోవడానికి ఏం చేయాలో నివేదిక తయారు చేద్దాం. ఆ నివేదిక ఆధారంగా మనం ముందుకు వెళ్దాం. చంద్రబాబుతోనే రాష్ట్రం సుసంపన్నం అవుతుందని మనం నిరూపిద్దాం.

జగన్ రెడ్డి ఎంతటి దుర్మార్గుడంటే.. సొంత చిన్నాన్నను చంపి చంద్రబాబుపై నెట్టాడు. పింక డైమండ్ అన్నాడు. డీఎస్పీల ప్రమోషన్లలో అక్రమాలన్నాడు. పోలవరం, అమరావతి, ఇలా ఒక్కటేమిటి. అడ్డగోలుగా అన్ని రకాలుగా సోషల్ మీడియా వేధికగా తప్పుడు ప్రచారాలు చేశాడు. చొక్కా చినగకుండా హత్యాయత్నం అంటూ కోడికత్తి డ్రామా ఆడాడు. ఇప్పుడా కోడికత్తి డ్రామా బట్టబయలైంది. తల్లి చెల్లిని గెంటేశాడు. రోడ్డెక్కితే పరదాలు కప్పుకుని తిరుగుతాడు. ఇంట్లో ఉన్నా.. ఏం జరుగుతుందోననే భయంతో ఒక్కడే తలుపులు వేసుకుని దాక్కునే దిక్కుమాలిన స్థితికి జగన్ రెడ్డి వచ్చాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఓడించినప్పుడే బీసీలుగా మన జన్మకు సార్ధకం లభిస్తుందని పేర్కొన్నారు.

జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యులు, సాధికార సంఘాల కో-ఆర్డినేటర్ గుంటుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు రాజ్యాధికారం దక్కింది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటవ్వకుంటే.. ఇప్పటికీ మనం వెనుకబడిన వర్గాలుగా, ఓటర్లుగా మాత్రమే మిగిలేవాళ్లం. ఎన్టీఆర్ తీసుకున్న చొరవ, చంద్రబాబు ప్రోత్సాహంతో కొన్ని కులాలు చట్టసభల్లో అడుగు పెట్టాయి. జగన్ రెడ్డి వచ్చాక స్వాతంత్ర్యానికి ముందున్న పరిస్థితులు మళ్లీ బీసీలు ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇప్పటికైనా అందరం ఏకమై పోరాటం చేద్దాం. జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడుదాం అన్నారు.

టీడీపీ నాలెడ్జి సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ.. వ్యవసాయంలో కలుపు తీయకుండా ఎంత మేలుజాతి విత్తనాలు తెచ్చినాటినా ప్రయోజనం ఉండదు. అదే విధంగా రాజకీయాల్లో ఉన్నందున జగన్ రెడ్డి చేసిన ద్రోహం, దగాను ప్రజలకు తెలియజేయకుండా మనం ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు. మంత్రులిచ్చాను అంటున్న జగన్ రెడ్డిని 16,800 పదవులు లాక్కున్న విషయం గురించి ప్రశ్నించండి.

సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే.. రద్దు చేసిన 30 బీసీ పథకాల సంగతేంటి అని అడగండి. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం గురించి మాట్లాడితే.. ఎంత మందికి రుణాలిచ్చారని ప్రశ్నించండి. సబ్ ప్లాన్ ఏమైంది, రూ.75వేల కోట్లు ఎందుకు మళ్లించారని నిలదీయండి. మంత్రులుగా నియమించామని చెబుతన్న జగన్ రెడ్డి.. వారిపై రెడ్లను షాడోలుగా నియమించడాన్ని ఎలుగెత్తి చాటండి. గజదొంగ జగన్ రెడ్డి చంద్రబాబుపై నిందలేస్తే ఊరుకునేది లేదనేలా తిరుగుబాటు చేయాలి. పేదల్ని ధనవంతుల్ని చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తుంటే.. పేదల్ని పేదలుగా ఉంచి, వారితో ఓట్లు వేయించుకుని తాను గద్దెనెక్కి డాన్సులు చేయాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికల్లో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలి. పదవి వచ్చిన వారు కిందనుండే వారిని ఆర్ధికంగా సుసంపన్నుల్ని చేయాలి. అందరం కలిసి అడుగేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని గుర్తెరగాలి అని పేర్కొన్నారు.

టీడీపీ మానవ వనరుల విభాగం సభ్యుడు ఎస్.పి.సాహెబ్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవంతో బీసీలందరినీ ఏకం చేయాలని భావించి బీసీ సాధికార సమితులకు రూపకల్పన చేశారు. నాయకత్వాన్ని పెంచడం, బీసీల్లో రాజకీయ అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బీసీలకు జరిగిన అన్యాయం కంటే.. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో జరిగిన అన్యాయమే ఎక్కువ. జనాభాలో 50శాతం ఉన్నప్పటికీ నిధులు సాధించుకోవడంలో వెనుకబడ్డాం. టీడీపీ భూములిచ్చింది. సబ్ ప్లాన్ తో నిధులిచ్చింది. కానీ ఇప్పుడు నిధులు లేవు. భూములు లాక్కుంటున్నారు. బీసీలు ఏకమైతే జగన్ రెడ్డికి చుక్కలు కనిపిస్తాయని తెలిసే కులాల వారీగా విడగొట్టి నకిలీ కార్పొరేషన్లు పెట్టాడు. సంక్షేమ పథకాలు రద్దు చేసి, నిధులు మళ్లించడం బీసీ ద్రోహం కాదా అని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ.. ప్రస్తుతం సోషల్ మీడియా విప్లవం నడుస్తోంది. మనం చేసే కార్యక్రమాలను నలుగురికి చేరవేయకుంటే మనం చేసినట్లు ఎలా తెలుస్తుంది. జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు ప్రజలకు వివరించడానికి, తెలుగుదేశం చేసిన అభివృద్ధిపై స్పష్టత ఇవ్వడానికి సోషల్ మీడియా అతిపెద్ద ఆయుధం అన్నారు. సంక్షేమం పేరుతో జగన్ రెడ్డ చేస్తున్న అన్యాయాన్ని, ఆగడాలను వివరిద్దాం. గతంలో అరకు అంటే కేరాఫ్ కాఫీ అనే పరిస్థితి నుండి.. నేడు కేరాఫ్ గంజాయి అనే పరిస్థితిక తీసుకొచ్చారు. యువతను, శ్రామికుల్ని, రైతుల్ని చంపుతూ.. యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు పెట్టుకునే అర్హత ఉందా? ఇవన్నీ ప్రల్లోకి తీసుకెళ్లాలి. సోషల్ మీడియాలో మన ఫోటో పెట్టామా వదిలేశామా అని కాకుండా.. పోస్టుతో పాటు హ్యాష్ ట్యాగ్ తప్పనిసరిగా వాడాల్సిందిగా సూచించారు.

ఓటర్ జాబితా పరిశీలకులు కోనేరు సురేష్ మాట్లాడుతూ.. మనం ఎన్ని రకాలుగా పోరాటం చేసినా ఓటర్ జాబితాను పరిశీలించుకోకుంటే తీవ్రంగా నష్టపోతాం. గత ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాల విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడంతోనే అధికారాన్ని కోల్పోయాం. వచ్చే ఎన్నికల్లో గత పరిస్థితులు మళ్లీ ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. 2014 ఎన్నికల్లో మనకు అనుకూలంగా ఉన్న మండలాలు, గ్రామాల్లో 2019 ఎన్నికల్లో ఓట్లు పడకపోవడానికి మనం ఓటర్ వెరిఫికేషన్ చేసుకోకపోవడమే ప్రధాన కారణం అన్నారు. ఈ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటే గెలుపు మనదేనని తెలిపారు.

కార్యక్రమంలో సాధికార సంఘాల కో-ఆర్డినేటర్ దేవళ్ల మళ్లిఖార్జునరావు, శాలివాహన సాధికార సమితి కన్వీనర్ మదనపు పోతులయ్య, భట్రాజ సాధికార సమితి కన్వీనర్ ప్రసన్నాంజనేయరాజు, మేదర సాధికార సమితి కన్వీనర్ ధూళిపాళ్ల యేసుబాబు, జంగం సాధికార సమితి కన్వీనర్ ఉమాకాంత్, బొందిలి సాధికార సమితి కన్వీనర్ భాను సింగ్, కృష్ణ బలిజ/పూసల బలిజ సాధికార సాధికార సమితి కన్వీనర్ కావేటి వేణుగోపాల్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE