Suryaa.co.in

Andhra Pradesh

గోపాలకృష్ణ ఆత్మహత్య పోలీసుశాఖకే అవమానకరం

– జవహర్ రెడ్డి నాటి మంత్రి నారా లోకేష్ దగ్గర పని చెయ్యలేదా?
– అజయ్ కల్లాం రెడ్డికి టిడిడి ఈవోగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు అవకాశాలు ఇవ్వలేదా?
– చెయ్యని తప్పుకు జీతాలు లేకుండా పోలీసుల్ని ఇబ్బంది పెడుతున్నారు
– కులోన్మాదంతో వైసీపీ ప్రభుత్వం దహించుకుపోవడం ఖాయం
– రాజమండ్రి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి

తూర్పు గోదావరి జిల్లా సర్పవరం సబ్ ఇన్ స్పెక్టర్ ముప్పవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య మొత్తం పోలీసు శాఖకు అవమానం. వైసిపి ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనం. సమర్థత, సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్ లు ఇవ్వాల్సిన కీలక శాఖలో కులాల వారీ ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత అనైతికం.

గర్వంగా పోలీసు యూనిఫాం వేసుకుని విధులు నిర్వర్తించే ఒక అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి డీజీపీ ఏమి సమాధానం చెపుతారు? కులం, మతం కంటే సమర్ధులకే టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ పట్టం కట్టి గౌరవించేది. ఇప్పుడు సిఎంఓలో కీలకస్థానంలో ఉన్న జవహర్ రెడ్డి నాటి పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేష్ దగ్గర పని చెయ్యలేదా? ఇప్పుడు సీఎం జగన్ దగ్గర ఉన్న అజయ్ కల్లాం రెడ్డికి టిడిడి ఈవోగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు అవకాశాలు ఇవ్వలేదా?

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం కారణంగా వందల మంది పోలీసు అధికారులకు గత రెండు, మూడేళ్లుగా పోస్టింగులు నిలిపివేయడం వాస్తవం కాదా? చెయ్యని తప్పుకు జీతాలు లేకుండా పోలీసుల్ని ఇబ్బంది పెడుతున్నారు. తండ్రిని కోల్పోయిన గోపాలకృష్ణ పిల్లల ఉసురు తగిలి కులద్వేషంతో రగిలిపోతున్న వైసీపీ ప్రభుత్వం దహించుకుపోవడం ఖాయం.

 

LEAVE A RESPONSE