– సైబర్ నేరస్తుల కంటే దారుణంగా ఏపీ ప్రభుత్వం తయారైంది
– జీపీఎఫ్ సొమ్మును మాయం చేశారు
– జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ని జగన్ ప్రావిడెంట్ ఫండ్ గా మార్చారు
– జమ అయిన అకౌంటు మళ్లీ డ్రా చేసే అధికారం ఎంప్లాయికే తప్ప ప్రభుత్వానికి లేదు
– ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఏ రాష్ట్రంలో జరగని ఎకనామిక్ డిజార్డర్స్, ఫైనాన్షియల్ డిసార్టర్స్ ఏపీలో జరుగుతోంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు పబ్లిక్ డెబిట్ అని ఉంటుంది. అందులో ప్రధానమైంది జీపీఎస్. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లీళ్లు, వైద్యం, అవసరాలకు ఏర్పాటు చేసుకునే జీపీఎఫ్ సొమ్మును మాయం చేశారు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ని జగన్ ప్రావిడెంట్ ఫండ్ గా మార్చారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగస్థుల జీపీఎఫ్ అకౌంట్ లో డీఏ అరియర్స్ పడితే వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దాన్ని 2021-22 ఏప్రిల్ నెలలో మళ్లీ జీపీఎఫ్ అకౌంట్లలోకి క్రియేట్ చేశారు. ఎంప్లాయిస్ కు ఇచ్చే డీఏ అరియర్స్ మొత్తం ఉద్యోగస్థులకు ఇచ్చేసినట్లు డెబిట్ చూపారు. మార్చిలో తిరిగి చెల్లించినట్లుగా జీపీఎస్ అరియర్స్ లో చూపారు. జీపీఎఫ్ అకౌంట్ లోకి వెళ్లాలంటే సీఎఫ్ఎంఎస్ లో క్లియర్ అయి ఎంప్లాయిస్ ఖాతాకి జీపీఎఫ్ అకౌంట్ లో జమ అవుతుంది. జమ అయిన అకౌంటు మళ్లీ డ్రా చేసే అధికారం ఎంప్లాయికే తప్ప ప్రభుత్వానికి లేదు. జీపీఎఫ్ అకౌంట్ డబ్బులంటే బ్యాంకులో భద్రంగా దాచుకున్న డబ్బులాంటిదే.
దీనికి ఏజీ ఇంట్రస్ కూడా చెల్లిస్తారు. డీఏ అర్రియర్స్ కూడా ప్రభుత్వం క్యాష్ ఇవ్వలేకపోతే బుక్ అడ్జ్ స్ట్ మెంట్ కింద ఏజీకి ఇచ్చి జీపీఎఫ్ అకౌంటును క్రియేట్ చేస్తారు. 2018 నుంచి ఇవ్వాల్సిన డిఏ అరియర్స్ మొత్తం క్యాష్ ఇస్తానన్న జగన్ ప్రభుత్వం క్యాష్ ఇవ్వకుండా జీపీఎఫ్ అకౌంటుకు క్రియేట్ చేశారు. అది ఎంప్లాయిస్ కు ఉపయోగపడకుండా 2022 మార్చిలో మళ్లీ ఎంప్లాయిస్ కు చెల్లించినట్లు చూపారు. దీనిపై ఉద్యోగ సంఘాలు గతంలోనే కంప్లైంట్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు.
మా అమౌంటు 18వందల కోట్లు ప్రభుత్వం తీసుకొందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. జులై 2018, జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత యేడాది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమచేసి తేదీ మారకముందే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. వేసి మళ్లీ తీసుకోవాల్సిన అవసరమేమొచ్చింది? ప్రభుత్వం వాడుకుందా లేక ఇతర కారణాలున్నాయా అనేది తేలాలి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీకి డబ్బులొస్తే ప్రభుత్వం వాడుకోవడం చాలా అన్యాయం.
జీపీఎస్ అనేది దాదాపు బ్యాంకు అకౌంటు లాంటిది. ఉద్యోగస్థులకు చెందిన డబ్బు మాత్రమే అందులో ఉంటుంది. ప్రభుత్వం డబ్బు అందులో ఉండదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లీళ్లు, వైద్యం, అవసరాలకు ఏర్పాటు చేసుకునే జీపీఎఫ్ సొమ్మును మాయం చేశారు. 6,800 కోట్లు డీఏ అరియర్స్ ఉంది. రిటైర్ మెంట్ డబ్బులు 2,200 కోట్లు ఉద్యోగస్థులకు ఇవ్వాల్సి ఉంది, దీన్ని మార్చి లోపు ఇచ్చేస్తామని డిసెంబర్ లో జరిగిన అగ్రిమెంట్ లో చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు.
ప్రభుత్వం చెప్పిన ఆరు నెలలకు కూడా రిటైర్ మెంట్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. జీపీఎఫ్ లో డబ్బులు ఉన్నాయనుకుంటే ఆ డబ్బు డ్రా చేయడానికి వీలులేదు. మనం వేసుకున్న లెక్కలు వేరు, జీపీఎఫ్ స్లిప్పులు వేరుగా ఉంటున్నాయి. ప్రభుత్వం బడ్జెటింగ్ లో, పబ్లిక్ కి ఫిగర్స్ చూపించడంలో తప్పులు చూపిస్తోంది. జీపీఎఫ్ మొత్తం మేమే వాడుకున్నాం. త్వరలో ఇస్తామని ప్రభుత్వం చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు.
అప్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రము ఇలా చేసి ఉండదు. అప్పు తెచ్చుకోవడానికి ప్రభుత్వానికి అప్పు తక్కువగా ఉందని చూపించే విధానంలో ఈ మొత్తం ఉద్యోగస్థులకు చెల్లించేశామని దొంగ లెక్కలు చూపించారేమో అని అనుమానం కలుగుతోంది. ఉద్యోగస్థుల జీపీఎఫ్ పట్టుకునే పరిస్థితి లేదు. దాన్ని డ్రా చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. అందులో క్రెడిట్ అవ్వాలంటే సీఎఫ్ఎంఎస్ లో పాస్ అయిన తరువాత క్రెడిట్ అవుతుంది. సీఎఫ్ఎంఎస్ లో పాస్ అవడమంటే అధికారపరంగా ప్రభుత్వం జీవో ఇచ్చి దానికి బిల్స్ వేసి ఓ ప్రాసెస్ అయిన తరువాత మాత్రమే జీపీఎఫ్ కు వెళ్తుంది.
అలా వెళ్లిన అమౌంట్ ని వెనక్కి తీసుకురావడమనేది ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఇది ఏపీలో మాత్రమే జరుగుతోంది. రిటైర్డ్ అయిన ఎంప్లాయిస్ కి ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేదు, కంపార్స్మెంట్ అపాయింట్ మెంట్ లు క్లియర్ చేయలేదు. చాలమంది ఎంప్లాయిస్ కి రెగ్యులర్ గా జీతాలు ఇవ్వడంలేదు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కి 60 శాతం మాత్రమే 1వ తేదీన జీతాలిస్తున్నారు. మిగతా 40 శాతం అంచలంచలుగా ఇస్తున్నారు.
ఉద్యోగస్థులు దాచుకున్న సేవింగ్స్ తో ప్రభుత్వం ఆట్లాడుకోవటం, ఫైనాన్షియల్ గా తప్పుడు ఫిగర్స్ చూపించడం, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం అన్యాయం. ఉద్యోగస్థుల కష్టార్జితమైన డీఏ అర్రియర్స్ రూ.800 కోట్లు వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉద్యోగ సంఘాలు కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీ పర్చూరు అశోక్ బాబు డిమాండ్ చేశారు.