Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కు ఒక న్యాయం… ఏబీ కి మరొక న్యాయమా?

– ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేయరా?
– మంచి బ్రాండ్లు కావాలని నినాదిద్దాం
– పిచ్చి బ్రాండ్లు తాగి… మీ భర్తలు త్వరగా ఎక్స్ క్యూజ్ మీ అంటే కష్టం
– మంచి బ్రాండ్ల కోసం మహిళలే ముందుకు రావాలి…
– ఎందుకంటే మీ భర్తలు మద్యం మానరు కాబట్టి…
– పద్మ విభూషణ్ రామోజీరావు పై అవాకులు చెవాకులు రాస్తారా?
– ఈనాడును కాదని, అబద్ధాలు రాసే సాక్షిని చదవాలా??
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఒక న్యాయం, 43 కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మరొక న్యాయమా అంటూ నరసాపురం ఎంపీ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఏసీబీ కేసులో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు సాక్షులను ప్రభావితం చేస్తే, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేయ రా? అంటూ నిలదీశారు. సాక్షులను ప్రభావితం చేస్తాడని, అందుకే బెయిల్ రద్దు చేయమని పిటీషన్ వేసినందుకే నా కాళ్లు కట్టేసి కొట్టించావు కదా… అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యం దుకాణాలలో మంచి బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని మహిళలే నినా దించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. ఎందుకంటే… మీ భర్తలు మద్యం మానరు కాబట్టి, పిచ్చి పిచ్చి మద్యం సేవించి, త్వరగా ఎక్స్ క్యూజ్ మీ … అనే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లభించని మద్యం బ్రాండ్లను, రాష్ట్రంలో ప్రభుత్వం విక్రయిస్తుందని మండిపడ్డారు. మద్యం దుకాణాలలో ప్రముఖ బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని అడగడం మీ హక్కు అని ఆయన అన్నారు. మీ హక్కును విస్మరించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ… సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనంపై తీవ్రంగా స్పందిస్తూ పద్మ విభూషణ్ రామోజీరావు పై అవాకులు చెవాకులు రాయడాన్నీ తీవ్రంగా ఖండించారు. ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం వాస్తవాలతో కూడినదైతే, సాక్షి దినపత్రిక అచ్చంగా అబద్దాలని రాస్తుందని మండిపడ్డారు.

ఎస్ జి ఎస్ లాబోరేటరీ ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ లలో, పైరో గల్లోలు ఉన్నట్లు పేర్కొందన్నారు. విషపూరిత అవశేషాలు ఉన్న మద్యం బ్రాండ్లను అదేపనిగా తాగితే, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన మాదిరిగానే జగనన్న వితంతు దీవెన పథకంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే ఐదు డిస్టరీలకు అనుమతి ఇచ్చారని పేర్కొంటున్న సాక్షి దినపత్రిక, ఆ డిస్టరీలకు సొంత బ్రాండ్లు లేవన్న విషయాన్ని ఎక్కడా చెప్పడం లేదని అన్నారు.

ప్రముఖ మద్యం బ్రాండ్లు అయిన ఆఫీసర్ ఛాయిస్, మేక్ డబల్ నెంబర్ వన్ బ్రాందీ, విస్కీ.., మెన్షన్ హౌస్, అరిస్టోక్రాట్ విస్కీని, రాష్ట్రంలోని మద్యం దుకాణాలు ఎందుకు విక్రయించడం లేదని ప్రశ్నించారు. ఈమధ్య బ్రాండ్లు దేశమంతటా లభిస్తాయన్న ఆయన, గతంలో రాష్ట్రంలోని డిస్టరీ ల లో వారి ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తి చేసేవారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మద్యం డిస్టరీ లను ఎవరు నిర్వహిస్తున్నారో చెప్పమంటే, చంద్రబాబు హయాంలోని ఈ డిస్టరీలకు అనుమతించారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అసలు తాము అడుగుతున్నది ఏమిటి?, సాక్షి దినపత్రిక సమాధానం చెబుతున్నది ఏమిటి అంటూ మండిపడ్డారు. మద్యాన్ని ఎవరైనా సేవించేది రాత్రి పూట స్వాంతన చెంది, పొద్దున్నే తలపోటు రాకుండా ఉండేందుకు సేవిస్తారని, ఈ పిచ్చి బ్రాండ్లను సేవిస్తే… లివర్ కిడ్నీ లు చెడిపోవడం ఖాయమన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఆంధ్ర గోల్డ్, హైదరాబాద్ బ్లూస్ వంటి ఈ పిచ్చి బ్రాండ్లు లభిస్తాయా? అంటూ రఘురామరాజు సూటిగా ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో ప్రముఖ మద్యం బ్రాండ్ లు లక్షల కేసులు విక్రయిస్తే, ఇప్పుడు కొన్ని వేల కేసులు విక్రయించగా, మరికొన్నింటి సంఖ్య సున్నాకు పరిమితమైందని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఐదు డిస్టరీ లకే 50 శాతం ఆర్డర్లను ఇస్తే, తాము మాత్రం రాష్ట్రంలోని 16 డిస్టరీలకు న్యాయబద్ధంగా ఆర్డర్లను ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, సకుటుంబ సపరివార సమేతంగా పిచ్చి, పిచ్చి పేర్లతో బ్రాండ్ల పేర్లు పెట్టి, వాటిని అప్రూవ్ చేసుకుంటున్నారన్నారు.. డిస్టరీ లకు మద్యం ఆర్డర్ ఇచ్చేది వారేనని, ఉత్పత్తి చేసేది వారేనని… సాక్షి దినపత్రికలో మాత్రం ప్రజలను పిచ్చోళ్ళను చేయడానికి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సర్కారు సారా సర్కార్
బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం విక్రయాలను చేపడుతూ సాంఘిక సేవ చేస్తుందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో పిల్లలకు చదువు చెప్పిస్తూ, వసతి సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని, వితంతువులకు పింఛన్లు ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొనడం చూస్తుంటే, ఈ సర్కారు సారా సర్కార్ అని స్పష్టమవుతుందన్నారు. అమరావతి భూములను రైతులకు కౌలునిస్తానని చెబుతూ, శ్రమ జీవులకు మద్యం తాగించి, వారి భార్యలను వితంతువులు చేశాక… జనాలు లేకపోతే, అసలు చేసేదేమి ఉంటుందని అని ప్రశ్నించారు.

మద్యం విక్రయాలను క్రెడిట్ కార్డు ద్వారా కాకుండా ఎందుకని నగదు ద్వారానే జరుపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పదే పదే అడుగుతున్నా ఎక్కడి దొంగ లు, అక్కడే గప్చిప్ అన్నట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.. క్రెడిట్ కార్డు ద్వారా మద్యం విక్రయాలు చేపడితే దొంగ బ్రాండ్లు తీసుకురావడానికి వీలు కాదని, ప్రముఖ బ్రాండ్లను విక్రయించేందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు.

ప్రముఖ బ్రాండ్లు ఏమైనా రాష్ట్రంలో మద్యం విక్రయించడానికి నిరాకరిస్తున్నాయా వాసుదేవా రెడ్డి అంటూ ప్రశ్నించారు. 300 యూనిట్లు విద్యుత్ వినియోగం దాటిన వారికి సంక్షేమ కార్యక్రమాలను కట్ చేస్తున్నట్లు గానే, నెలకు 1500రూపాయల మద్యం సేవిస్తున్న వారికి సంక్షేమ పథకాలలో కోత విధించాలన్నారు. అలా చేయాలంటే మద్యం విక్రయాలలో పారదర్శకత ఉండాలని, క్రెడిట్ కార్డుల ద్వారా మద్యం విక్రయాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రేపు సాక్షి దినపత్రికలో ఏమి సమాధానం చెబుతారో చూద్దామన్నారు.

ఎంపీగానే సంసద్ టీవీ చర్చలకు ఆహ్వానిస్తారు..
సంసద్ టీవీ చర్చలకు ఎంపీ గానే ఎవరినైనా ఆహ్వానిస్తారని, ఆ విషయం మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. సంసద్ టీవీ సీఈవో కు విజయసాయి లేఖ రాస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఎంపీ రఘురామకృష్ణంరాజును చర్చలకు ఆహ్వానించవద్దని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంసద్ టీవీ చర్చలో పాల్గొనాలి అంటే వెర్రి ముఖం వేసుకున్న వాళ్ళను పిలవరని, విద్వత్తు ఉండాలని, భాషపై చక్కటి పట్టు ఉండాలని…కష్కో కుష్కో భాష మాట్లాడితే చర్చలకు ఆహ్వానించరని ఎద్దేవా చేశారు.

సంసద్ టి వీ ఏ పార్టీకి సొంతంకాదని, రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ పర్యవేక్షణలో స్వతంత్రంగా నడిచే ఛానల్ అని తెలిపారు. ఏపీలో బ్లూ మీడియాను బెదిరించినట్టుగా, సంసాద్ టీవీని బెదిరించలేవని, నీ తెలివితక్కువతనాన్ని మన్నిస్తున్నా నని అన్నారు. ఒకవేళ తనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పేర్కొనడం ఇష్టం లేకపోతే, ఉన్నదో లేదో తెలియని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చేత, పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని చెప్పారు. ఆ విషయాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ కు నివేదించాలన్నారు.

దానితో అప్పుడు తనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కాకుండా, స్వతంత్ర లోక్ సభ సభ్యునిగా పేర్కొంటారని వివరించారు. నీ చెత్త లెటర్లు, పిచ్చి పిచ్చి ట్వీట్ల తో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. మహాభారతంలో దుర్యోధనుడు, కౌరవుల చావుకు కారణమైన శకుని పాత్రను పోషిస్తున్నావని విజయసాయిరెడ్డి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE