జగన్ తో పాటు జైలుకు వెళ్లిన శ్రీలక్ష్మికి ఎలా పోస్టింగ్ ఇచ్చారో చెప్పాలి

– జగన్ ని నమ్ముకుంటే సీఎస్ సమీర్ శర్మ కూడా శ్రీలక్ష్మిలాగ జైలుకు వెళ్లక తప్పదు
– సీఎస్ సమీర్ శర్మ డూడూ బసవన్న
మాజీ మంత్రి కె ఎస్ జవహర్

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ పెట్టారు. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసినప్పడు జగన్ తో పాటు జైలుకు వెళ్లిన శ్రీలక్ష్మికి ఎలా పోస్టింగ్ ఇచ్చారో చెప్పాలి. మీరంతా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటూ దొంగలకు ద్వారాలు తెరుస్తున్నారు. హైకోర్టును నిలబెట్టినవారికి ఏవిధమైన పోస్టులు ఇచ్చారో ప్రజలు గమనించాలి. సవాంగ్, సుబ్రమణ్యంలను ఏగతి పట్టించారో ప్రజలు గమనించాలి. జగన్ ని నమ్ముకుంటే సీఎస్ సమీర్ శర్మ కూడా శ్రీలక్ష్మిలాగ జైలుకు వెళ్లక తప్పదు. ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో ఇచ్చినా, ఛార్జ్ మెమో ఇచ్చినా, సస్పెండ్ చేసినా ఏం చేసినా ఇప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే కాలం దగ్గర పడింది. సీఎస్ సమీర్ శర్మ డూడూ బసవన్న లా తయారయ్యారు. జగన్ చేసేది తప్పా? వప్పా అని చెప్పాల్సిన వారు చెప్పడంలేదు.

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఒక్క ప్రావిడెంట్ ఫండే కాకుండా పంచాయతీరాజ్, మున్సిపల్ నిధులు 6,700 కోట్లు, అభయహస్తం నిధులు 2,118కోట్లు, భవన కార్మికుల యోగ క్షేమ నిధులు రూ.1000 కోట్లు, రైతుల ధాన్యం కొనుగోలు నిధులు 3 వేల కోట్లు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ కింద ప్రభుత్వం వాడుకొని వారికి అన్యాయం చేశారు. రెండు నెలల్లో ప్రభుత్వం తెచ్చిన 30 వేల కోట్లు అప్పులు ఏమయ్యాయి?

తెచ్చిన అప్పులు చాలక ఈ డైవర్షన్ చేస్తున్నాడేమో అని అనుమానం కలుగుతుంది. ఏదే ఏమైనా తెచ్చిన అప్పుల లెక్కలు చెప్పాలి. ప్రభుత్వం రైతు, దళిత, కార్మిక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా నడుస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను కూడా మోసం చేసే నేర్పరితనం గల ఏకైక ప్రభుత్వం ఒక్క వైసీపీనే. ఉద్యోగ నియామకాలు శూన్యం, విద్యార్థుల ఫలితాలు అధమం. సీపీఎస్ పై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని, సీపీఎస్ ను రద్దు చేస్తానని చెప్పి మాట తప్పి.. మడమ తిప్పారు. సీపీఎస్ కు సంబంధించిన డీఏ రికవరీస్ లను వారి ఖాతాలలో జమ చేయకుండా వాటిని కూడా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ కు ఉపయోగించుకుంటున్నారు.

ఉద్యోగ సంఘాలు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. సీపీఎస్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. పీఎఫ్ లో అన్యాయం జరుగుతోంది. సర్వీస్ రూల్స్ లేవు. అశాస్త్రీయ విభజన వల్ల సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. ఎస్ జీటీ గా జాయిన్ అయినవారు ఎస్జీటీగానే రిటైర్ అవ్వాల్సి వస్తోంది. 4,786 ఎస్జీటీ పోస్టులను నేడు సప్రెస్ చేసి ఆ డబ్బులను కూడా జగన్ వాడుకున్నారు. రిక్రూట్ మెంట్ లేకుండా ఫలితాలు రావాలంటే ఎలా వస్తాయి? ఫలితాలు రాకపోవడానికి కారణమెవరంటే చంద్రబాబునాయుడు, టీడీపీ అంటూ మా మీదికి తోస్తున్నారు.

ఉపాధ్యాయులు కాపీలు కొట్టనీయకపోవడంతో ఫలితాలు తక్కువగా వచ్చాయనే పరిస్థితికి దిగజారారు. జగన్ రెడ్డి పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలే కాకుండా కర్షక వర్గాలన్నింటికి మోసం జరుగుతోంది. ప్రమోషన్లు ఇవ్వలేకపోతున్నారు. జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. రెండు సంవత్సరాలు దాటింది సచివాలయ ఉద్యోగులలో ఎంతమందిని రెగ్యులరైజ్ చేశారో చెప్పాలి. వారితో వెట్టిచాకిరి చేయించుకున్నారు.

వాలంటీర్లను కూడా మా కార్యకర్తల్నే పెట్టుకుంటున్నామంటున్నారు. వారికిచ్చే 5 వేలు స్కూల్స్ పై వినియోగిస్తే స్కూల్స్ బాగుపడతాయి. డీఎస్సీలు వేసి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాల్సివుంది. పీఎఫ్ యే కాదు రాబోయే రోజుల్లో కారుణ్య నియామకాలు కూడా వుండవేమో. దాదాపు 4వేల మందికి పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోతే వారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వలేదు. కరుణ లేని ప్రభుత్వం. ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది.

ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన బాధ్యత ఉద్యోగస్థులపై ఉంది. వైసీపీ నాయకులు జగన్ భజన మాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి. ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ప్రజలు గమనించాలని మాజీ మంత్రి కె ఎస్ జవహర్ వివరించారు.

Leave a Reply