– కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో
– కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
హైదరాబాద్: ‘‘ఆ నాడు ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్న వెధవ ఎవరు? ఆ నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు? ఆ నాడు విపక్ష శాసనసభ్యులతో రాయబారాలు నడిపి ప్రగతి భవన్‌కు తీసుకుపోయిన వెధవన్నర వెధవ ఎవరు? రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకుని చివరకు విలీనం అంటు పచ్చి అబద్ధాలు చెప్పిన దగాకోరులు ఎవరు? పార్టీలకు పార్టీలను మింగేసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అని నంగనాచి కబుర్లు చెప్తావా? పదేళ్ల పాటు నువ్వు, నీ అయ్య ప్రదర్శించిన అతి తెలివిని తెలంగాణ జనం చూశారు’’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విరుచుకుపడ్డారు.
కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో. పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా? 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతవా అని విరుచుకుపడ్డారు.