– ఈవో శ్రీనివాసరావు వెల్లడి
శ్రీశైలం: కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లను శ్రీశైలం ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎం.శ్రీనివాసరావు సమీక్షించారు. ఈ నెల 22 నుంచి నవంబరు 21 వరకు కార్తీకమాసోత్సవాలు జరగనున్నాయని, ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రణాళికబద్దంగా క్యూలైన్ల నిర్వహణ, పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలకు తగు ఏర్పాట్లు, భక్తులు కార్తీకదీపారాధనలు చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తరమాడవీధిలో, గంగాధర మండపం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. కార్తీకమాసమంతా కూడా ఆర్జిత అభిషేకాలు (గర్భాలయ, సామూహిక అభిషేకాలు) నిలుపుదల చేశామని చెప్పారు.