Suryaa.co.in

Editorial

జాతీయ పార్టీలో పెద్దల ‘గృహసంపర్క్’

-ఒంగోలులో ‘శృంగార’ కమలం
– పదవుల కోసం వ్యభిచారమా? ఛీ.. ఛీ..
– పలువురు అగ్రనేతల అనైతిక చర్యలపై పార్టీలో చర్చ
– గతంలోనే దీనిని బయటపెట్టిన గోదావరి జిల్లా నేత
– లేఖ ద్వారా రచ్చరంబోలా
– అగ్రనేతలకు ‘గృహసంపర్క్’ పథకంలో ‘సుఖ’ సంసారం
– ఒంగోలులో బట్టబయలైన కోడిగుడ్డురాజు శృంగారనైషధం
– పదవి కోసం తనను ఒంగోలు రెడ్డిగారు కోడిగుడ్డురాజు దగ్గరకు పంపాడంటూ ఓ మహిళా నేత వీడియో
– దానిని పార్టీ అధ్యక్షురాలు, మరో ప్రముఖుడికి పంపిన బాధిత మహిళ
– తనను ఆ రెడ్డిగారు మోసం చేశారంటూ మహిళ ఆవేదన
– నాయకత్వానికి ఫిర్యాదు చేసిన ఒంగోలు పార్టీ ప్రముఖుడు?
– జాతీయ పార్టీలో అనైతిక చర్యలపై చర్చలాంటి రచ్చ
– ‘సూర్య’కు ప్రత్యేకం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన రాజు కాని రాజు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్రంలో కొన్నేళ్లు పెత్తనం చేశారు. కార్యకర్తలు ఆయనను ముద్దుగా కోడిగుడ్డురాజు అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన కోడిగుడ్డు సైజులో నిష్ణాతుడు కాబట్టి. కోడిగుడ్డు ఎన్ని సైజులున్నాయన్న దానిపై ఆయన, కోడిగుడ్లు సప్లై చేసే కాంట్రాక్టర్ల దగ్గర బాగా పరిశోధన చేశారట. బహుశా అందువల్ల ఆయనకు ఆ పేరు వచ్చిందన్నది పార్టీ నేతల ఉవాచ.

ఆయన హయాంలో జిల్లా పార్టీ బాధ్యుల పదవులు, బాగా అమ్మకానికొచ్చాయన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. సదరు కోడిగుడ్డు రాజుగారిని ‘ఏదో ఒక’రూపంలో ప్రసన్నం చేసుకున్న వాళ్లకు, జిల్లా-రాష్ట్ర పదవులు దక్కాయన్నది గిట్టనివారి ప్రచారం. ఆ క్రమంలో సారు ఒంగోలు పర్యటనకు వెళ్లారట. అప్పుడు కీలక పదవి ఆశిస్తున్న ఒక రెడ్డిగారు, మన రాజుగారిని ‘ప్రసన్న’ం చేసుకోవడానికి మంచి విందు ఏర్పాటుచేశారట. సారుకు చిల్డ్ బీరన్నా, చికెనన్నా మహా ఇష్టమట.

ఎదుటివారి మనసెరిగి మసలుకోవడంలో అటు రెడ్డి గారూ నిష్ణాతులేనట. కాబట్టి మందు, విందుతో పాటు అదనంగా పొందు కూడా ఏర్పాటుచేశారట. గిద్దలూరుకు చెందిన ఒక మహిళను రాజు గారి సేవకోసం నియోగించారట. ఆ పనిచేస్తే నీకు న్యాయం చేస్తానని రెడ్డిగారు భరోసా ఇచ్చారట. పాపం.. అనారోగ్యంతో మంచానపడ్డ భర్త, ఇద్దరు పిల్లల కోసం ఆ మహిళ కోడిగుడ్డు రాజుగారికి ఆ రాత్రి సేవలందించిందట.

సీన్ కట్ చేస్తే…
కోడిగుడ్డు రాజుగారికి మరిచిపోలేని ‘అనుభవం’ అందించిన రెడ్డి గారి లక్ష్యం నెరవేరింది. పాపం కోడిగుడ్డు రాజుకు రాత్రంతా శ్రమదానం చేసిన ఆ పేద మహిళకు, ఇప్పటిదాకా సదరు రెడ్డిగారు చేస్తానన్న న్యాయం చేయలేదట. ఆ విషయాన్ని సదరు మహిళ.. రాష్ట్ర అధ్యక్షురాలికి స్వయంగా వీడియోల ద్వారా పంపింది.

‘‘ మీరంటే నాకు చాలా అభిమానం మేడమ్. నన్ను ఫలానా రెడ్డిగారు కోడిగుడ్డు రాజు దగ్గరకు పంపించాడు మేడమ్. నా భర్తకు ఆరోగ్యం బాగోలేదు. ఇద్దరు పిల్లలు మేడమ్. నేను తప్పు చేశాను మేడమ్. నన్ను వాడుకున్న రెడ్డిగారు నాకు అన్యాయం చేశారు మేడమ్. నాకు చదువులేదు. కూలిపని చేసుకుని బతికేదాన్ని.నాకు న్యాయం చేయండి’’ అంటూ రెండుచేతులూ జోడించి ప్రార్ధించింది.

హృదయవిదారకంగా బాధితురాలు చేసిన అభ్యర్ధన.. నైతిక విలువలు-సంస్కృతి-సంప్రదాయాల గురించి ఎక్కువగా మాట్లాడే సదరు జాతీయ పార్టీలో.. అగ్రనేతలుగా పేరున్న కొందరు ప్రముఖులు, మహిళలను ఏవిధంగా వాడుకుంటున్నారన్న నిజాన్ని బయటపెట్టింది. పైగా బాధితురాలు సొంత పార్టీకి చెందిన మహిళే కావడం మరో ఆశ్చర్యం. అసలామెకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, సదరు రెడ్డిగారే అలాంటి మరో ముగ్గురికి.. తన అవసరాల కోసం పార్టీ పదలులిప్పించారన్నది జిల్లా పార్టీలో వినిపిస్తున్న టాక్.

సీన్‌కట్ చేస్తే…
బాధితురాలి ఆర్తనాదం జిల్లా పార్టీ ప్రముఖుడికి, రాష్ట్ర ప్రముఖురాలు, మరో రాష్ట్ర ప్రముఖుడికీ వినిపించిందట. తనవద్దకు వచ్చిన ఫిర్యాదును ఆ జిల్లా ప్రముఖుడు, రాష్ట్ర ప్రముఖుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

ఇంతేనా..? ఒక్క ఒంగోలేనా?.. ఒక్క కోడిగుడ్డు రాజులేనా? అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇంకా సదరు జాతీయ పార్టీలో ఇలాంటి కళాకారులు చాలామంది ఉన్నారన్న ప్రచారం, దశాబ్ద కాలం నుంచీ వినిపిస్తోంది. ముఖ్యంగా ‘దేశం కోసం’ పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్లుగా ఉండే కొందరు ప్రముఖులు కూడా, ఇలాంటి శృంగార నైషధాలకు పాల్పడుతున్నట్లు పార్టీలో ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.

కొద్దినెలల క్రితం తణుకు పర్యటనకు వెళ్లిన ఓ రాష్ట్ర ప్రముఖుడు ఒక మహిళా నేత ఇంటికి ‘గృహసంపర్క్’ కార్యక్రమం కోసం వెళితే, అక్కడ శ్రమదానం జరిగిందన్న ప్రచారం పార్టీవర్గాల్లో గుప్పుమంది. సదరు మహిళ ఇంట్లో కనిపించిన ఆయన, పార్టీ నేతల ముందు అడ్డంగా దొరికిపోయారట.

కొన్నేళ్లు రాష్ట్ర పార్టీకి ‘కొసరు ఇన్చార్జి’గా వెలగబెట్టిన మరో ప్రముఖుడు కూడా, ‘శృంగారరసం’ బాగా పోషించేవారన్న ప్రచారం లేకపోలేదు. ఆయన రాసలీలపై గోదావరి జిల్లాకు చెందిన ఓ నాయకుడు స్వయంగా రాష్ట్ర అధ్యక్షురాలికి లేఖ రాసిన వైనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీలో జరుగుతున్న ఈ ‘గృహసంపర్క్’ కార్యక్రమాలను సదరు నేత తన లేఖలో కడిగేశారు.

గతంలో కొన్నేళ్లు రాష్ట్ర ప్రముఖుడిగా పనిచేసిన మరో ‘మహిళారాజుై’పె, బోలెడంత ప్రేమాభిషేకం ప్రచారం జరగడంతో, ఆయనను మరోచోటికి పంపిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు లేకపోయినా, సొంత ఊళ్లో జనం పట్టించుకోకపోయినా.. జాతీయ స్థాయిలో, టీవీలలో వెలిగే కొందరు నాయకుల ఉన్నతికి, ఇలాంటి పవళింపుల సేవలే కారణమన్నది సీనియర్-సిన్సియర్ నేతల ఉవాచ. అందుకే వారు ఢిల్లీ స్థాయిలో వెలిగిపోతున్నారని, అలాంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఏపీలో కొందరు నేతలు నిష్ణాతులన్నది సీనియర్ల మనోగతం. నిజం నారాయణుడికెరుక?

LEAVE A RESPONSE