– గ్రూప్-1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
– మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్ లలో
– ఏపీపీఎస్సీ కార్యదర్శి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ కు 4,496 మంది అర్హత పొందినట్టు వివరించారు. ఈసారి మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్ లలో ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. విశాఖ, అమలాపురం, విజయవాడ, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.