పశువుల కాపరుల దెబ్బకు కమలిన కమలం
పశువుల కాపరులపై గుజరాత్ బీజేపీ సర్కారు జంతు నియంత్రణ బిల్లు
పట్టణాల్లోకి మేకలు, గొర్రెలు, గాడిదల ప్రవేశం నిషేధం
పశువుల పెంపకానికి లైసెన్స్ తప్పనిసరి
పశువులు రోడ్లపైకి వస్తే యజమానికి ఐదేళ్ల జైలు శిక్ష
బీజేపీ సర్కారు నిర్ణయంపై పశువుల కాపరుల కన్నెర్ర
నిరసనగా గుజరాత్‌లో పాల అమ్మకాలు బంద్
పాల కొరతతో బీజేపీ సర్కారుపై జనం ఆగ్రహం
దానితో దిగివచ్చిన గుజరాత్ బీజేపీ సర్కార్
గవర్నర్‌కు పంపిన బిల్లు వెనక్కి తీసుకున్న వైనం
గుజరాత్‌లో బీజేపీపై పశువుల కాపరుల విజయం
బిజెపికి చుక్కలు చూపించిన మాల్డారీలు
దేశంలోని జాతీయ-ప్రాంతీయ పార్టీలకు.. కంటిమీద కునుకులేకుండా చేస్తున్న బీజేపీకి ఇది షాక్. ఇది.. తనను ఎదిరించే వారిపై ఈడీ-ఐటీ-సీబీఐని ప్రయోగించి, తన పాదాక్రాంతం చేసుకుంటున్న బీజేపీకి.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే తగిన ఎదురుదెబ్బ ఇది. యస్. ఆశ్చర్యమైనా ఇది నిజంగా నిఝం! అంత సాహసం చేసింది ఏ కాంగ్రెస్ పార్టీనో, ఏ ఆమ్ ఆద్మీ పార్టీనో అనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఆ మాటకొస్తే అసలు రాజకీయపార్టీలేవీ కావు. అచ్చంగా పశువుల కాపరులు వీరభద్రులై బీజేపీ సర్కారు మెడలు వంచిన వైచిత్రి ఇది. నమ్మడం లేదా? అయితే ఆ విచిత్రాన్ని చూడండి.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో బిజెపికి పశువుల కాపరులు చుక్కలు చూపించారు. మాల్దారీల దెబ్బకు బీజేపీ ప్రభుత్వం ఠారె త్తిపోతోంది. రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్ ను ఉక్కు పిడికిలితో పాలిస్తున్న బీజేపీకి , పశువుల కాపర్లు పట్టపగలే చుక్కలు చూపించారు.
బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వివాదాస్ప ద జంతు నియంత్రణ బిల్లును వ్యతి రేకిస్తూ రాష్ట్రంలోని 60 లక్షల మంది మాల్దారీలు రాష్ట్రాన్ని స్తంభింపజేశారు. దీంతో బిజెపి ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. సర్కారు అత్యవసరంగా బుధవారం అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చ లేకుండానే, బిల్లును వెనక్కి తీసుకొంటు న్నట్లు ప్రకటించింది.
మాల్ ధారీ అనేది గుజరాతీ పదం. మాల్ అంటే పశువులు… ధారీ అంటే కలిగి ఉండటం. అంటే పశువు లు పెంచుకొనేవారిని మాల్దారీలు అంటారు. చాలాకాలం క్రితం వీరు యుపీ, రాజస్థాన్ నుంచి వచ్చి, గిర్ అభయారణ్యం అంచుల వెంట స్థిర పడ్డారు. పశువులు, మేకలు, గొర్రెలను పెంచుకునే వారు. పాల విక్రయం వీరి ప్రధాన వృత్తులుగా ఉండేవి.
గుజరాత్లోని పట్టణాలు, నగరాల్లోకి పశు వులు, మేకలు, గొర్రెలు, గాడిదల వంటి. జంతువులు ప్రవేశించడాన్ని నిషేధించేందుకు బీజేపీ ప్రభుత్వం, గతం లో గుజరాత్ క్యాటిల్ కంట్రోల్ కీపింగ్ అండ్ మూవింగ్ ఇన్ అర్బ న్ ఏరియాస్ బిల్ 2022 రూపొందిం చింది. దీన్ని అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపారు.
ఈ బిల్లు చట్టంగా మారితే రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 162 మున్సి పాలిటీల్లోకి పశువుల ప్రవేశం కష్టం అవుతుంది. పట్టణాల్లోకి పశువులను తరలించాలన్నా, పెంచుకోవాలన్నా లైసెన్సులు తప్పని సరిగా తీసుకోవాల్సి వచ్చేది. లైసెన్స్ తీసు కొన్న 15 రోజుల్లోగా పశువుల యజమానులు పశువులన్నింటికీ ట్యాగులు వేయాలి. ఒకవేళ పశువులు కట్లు తెంపుకొని రోడ్డుపైకి వస్తే, దాని యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చే యొచ్చు. ఆ నేరానికి ఐదేళ్ళ కఠిన జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల వర కు జరిమానా విధించేలా బిల్లునురూపొందించారు.
ఈ బిల్లును బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాల్దారీలు డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆ ఆందోళన మంగళవారం హింసాత్మకంగా మారింది. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్ వంటి ప్రధాన నగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల మాల్దారీలు రోడ్లను దిగ్బంధించారు. పాలవిక్రయాన్ని స్వచ్ఛందంగా నిలిపేశారు.
దీంతో పాల కొరత ఏర్పడింది. పాలు దొరక్క ప్రజలు తీవ్ర |ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం వణికిపో యింది. ఆగమేఘాల మీద గవర్నర్ ను సంప్రదించి, బిల్లును వెనక్కి తీసుకుంది. మాల్దారీల దెబ్బకు బిజెపి ప్రభుత్వానికి దిమ్మ తిరిగి పోయింది. దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది.
దేశంలోని మోతుబరి ప్రతిపక్షాలు చేయలేని పని, పశువుల కాపరులు ఐకమ్యంతో చేసి చూపించారు. అది కూడా మోదీ సొంత రాష్ట్రంలో ఇది బీజేపీని వ్యతిరేకిస్తున్నా, ఎదిరించలేక వణికిపోతున్న విపక్షాలకు స్ఫూర్తి అవుతుందా? చూడాలి!
– కె.కుమార్‌రెడ్డి
తిరుపతి