Suryaa.co.in

Political News

జీ… ఏమిటీ తలనొప్పి?

ప్రియమైన మీకు..!
ఉభయకుశలోపరి..!
అతి వినయ విధేయుడు..మీకు అత్యంత ప్రీతిపాత్రుడు వ్రాయు మరొక లేఖ..!
ప్రతివారం క్షేమ సమాచారములతో..!సవివరంగా లేఖలు వ్రాద్దామని సంకల్పించిన వాడిని.
ఇక్కడ పరిస్దితులు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి.

ఏదో మీరు తిమ్మిని బమ్మి చేసి నన్ను పీఠం మీద కూర్చోబెడతారన్న ఆశే కాని..నాకు అంత స్దిమితం లేదు.
మీరు చెపితే నమ్మరు..అసలు సంతోషమే లేదు.
మనశ్శాంతి గా వ్యవహారాలు నడుపుకోవటమే కుదరటం లేదు.
ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు దెబ్బ తగులుతుంది.
నేనుచెప్పినదానికి..అనుకున్నదానికి..జరుగుతున్నదానికి అసలు పొంతన ఉండటం లేదు.

చంద్రబాబు ని అరెస్టు చేసి లోపలైతే పెట్టాను కాని..!
అతన్నేమి పీకలేకపోయాను..!
బయట ఉంటే సభలు..సమావేశాలు పెట్టుకునే వాడు..!
లోకేష్ పాదయాత్ర చేసుకునేవాడు..!

కాసేపు నన్ను తిట్టుకునే వారు..!
మనవాళ్ళు రాళ్ళు వేసి..తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే వాళ్ళము ఎంచక్కా!

ఇప్పుడు జనం బయటకొచ్చేస్తున్నారు..!
మన పోలీసులు ఆపలేక పోతున్నారు..!
కొట్టడానికి జంకుతున్నారు..తిరగబడి కొట్టేస్తారేమో అని..!
ఆడాళ్ళేటండి బాబూ!
అలా బయటకొచ్చేసారు..ఒకావిడ తొంభైనాలుగేళ్ళంట..ఆవిడ కూడా తయారైపోయింది.
అస్తమాను గొడవలంటే మన పోలీసులు కూడా విసుక్కుంటున్నారు..!

తెలంగాణాలో బాగా ఎక్కువైపోయింది..!
బాబూ కొడుకులు నన్ను దొబ్బేస్తున్నారు..!
ఇంకో పక్క లోకేష్ గడగడా ఇంగ్లీషులో మాట్లాడేస్తున్నాడు.
మీ వాడు అర్నాబ్ గోస్వామి..ఒకడు..!తన పని తను చేసుకోకుండా ఒన్ టు ఒన్ డిబేట్ అంటున్నాడు.
మధ్యలో నన్ను లాగాడు..!
లోకేష్ రడీ అంటున్నాడు..!
నాకు గుండె ఝల్లు మంది..!

ఇదిలా ఉంటే..!

మా ఎంపీ రఘురామకృష్ణంరాజు ..!
చెవిలో జోరీగ లా ఉన్నాడు.
రోజూ రచ్చబండలో నమిలేస్తున్నాడు..!నరాలు కట్టయిపోతున్నాయు..!
అతన్ని అనర్హుడ్ని చెయ్యమని ఎంత మొత్తుకున్నా మీరు పట్టించుకోలేదు.
పట్టుకెళ్ళి ఇరగ్గొట్టేసాము..!
అయినా మట్టగిడసలాగ జారిపోయారు.

రఘురామరాజు..! అబ్బ ! సాయిరామ్ !
అతని పోరు అంతంత మాత్రం కాదండి..!
వెర్రెక్కించేస్తున్నాడు..డైలీ సీరియల్ మాదిరి కరెక్టు గా భోజనానికి కూర్చునే ముందు మెదలెడతాడు..!
అన్నం సహించటం లేదంటే నమ్మండి..!

ఇప్పుడు లోకేష్ దూసుకొచ్చేస్తున్నాడు..ఏమాట కామాటే..అదరగొడుతున్నాడు..!
వాళ్ళ కేడరు లో జోష్ పెంచుతున్నాడు.ఆ వార్నింగ్ లు..దూకుడు చూస్తుంటే..అతని ముందు నా ప్రసంగాలు..ప్రెస్ మీట్లు వెలవెల పోతున్నాయి.

మావాళ్ళకు తెలియటం లేదు గాని…వరుస ఘటనలు మాకు గొయ్యి తీసేస్తున్నాయి.

అతను ఉన్నప్పుడు ఇంత చెండాలంగా ఎప్పుడూ జరగలేదు..నేను ..మీరు కూడా ఒప్పుకుని తీరాలి.
ఇప్పడు సమస్య చూడటానికి చిన్నగా అనిపిస్తున్నా..నా ఎడమ కన్ను అదురుతున్నది.

ఇదంతా చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది..!
ఏదో జరగబోతున్నదనిపిస్తుంది..మా వాళ్ళని పచ్చి బూతులు తిట్టమంటే తిడతారు..!
ఎవరికీ అర్దం కాకుండా మాట్లాడమంటే మాట్లాడతారు..!
అబద్దాలు ఆడమంటే ఆడతారు…!
మేటర్ ఏదైనా టీడీపి మీదకు తోసేయమంటే తోసేస్తారు..!
సమస్యను పరిష్కరించలేరు..ట్రబుల్ షూటర్స్ లేరు.

మా దంతా సెటిల్ మెంట్ యవ్వారం..డీల్స్..పంచాయితీలు చెయ్యగలరు .
ఈ సమస్య నుండి మీరే బయట పడేయాలి.

అందుకే ముందస్తు ఎన్నికల కు వెళ్ళాలనిపిస్తుంది.
ఏదో పైన మీరు..పక్కన ఆయన ఉండగానే ..తంతు పూర్తి చెయ్యాలి..లేకపోతే గల్లంతే!
ఉభయులకు నష్టమే..!

జనం ఇప్పటికే చంద్రబాబు ని కావాలనుకుంటున్నారని రిపోర్టులొస్తున్నాయి.
గడపగడపలో జనం ఎగిరి తన్నుతున్నారు.
స్వయంగా నా సభల నుండి జనం పారిపోతున్నారు.

మా భజన బృందాలు సంగతి పక్కన పెడితే, మా గురించి కొంచెం చేదు సమాచారమే వినవలసి వస్తుంది.

అన్యధా శరణం నాస్తి.
మీరేమి చేస్తారో తెలియదు.
చంద్రబాబు కి అవకాశం ఇస్తే..మనకు ఇబ్బందే ..!
అట్టు పెట్టిన వాళ్ళకు అట్టున్నర పెడతానంటున్నాడు.అరెస్టు బూమరాంగ్ అయింది..!
ఇవన్నీ కూలంకషంగా ఆలోచించి..కార్యాచరణ బోధించగలరు.
ఇంతే సంగతులు ఇప్పటికి..!
నిరంతరం మీ అడుగుజాడల్లో ..నడుస్తూ..!
మీ అడుగులకు మడుగులొత్తుతూ..!
జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ..!

బిక్కు బిక్కు మంటూ గడిపే..!
సదా మీ విధేయుడు.

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE