ప్రైమ్9 ఛానెల్ లో కొంతకాలం పనిచేసిన 3గురు రిపోర్టర్స్, కెమెరా మాన్ పై ఆ ఛానల్ యాజమాన్యం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసుల్ని బనాయించింది. హైద్రాబాద్ పంజాగుట్ట స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ వేయించింది. ఛానల్ యాజమాన్యం పై తనకొచ్చిన కొన్ని మెసేజ్ లను సాంబశివరావు మరికొందరికి పంపి తమ పరువుకు భంగం కలిగించినట్లు యాజమాన్యం న్యాయస్థానానికి అందించిన ఫిర్యాదులో తప్పుడు అభియోగాన్ని మోపింది. పైగా 4గురు రిపోర్టర్స్ పై హైద్రాబాద్ లో కేసు పడిందంటూ జిల్లా లోని తమ సిబ్బంది ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఆ ఛానల్ లో ఇప్పుడు పనిచేస్తున్న కొందరు సిబ్బంది తమకు వీలైనన్ని వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఈ సమాచారాన్ని చేరవేస్తున్నారు.సిబ్బందికి జీతాలు… కమిషన్లు ఇవ్వకుండా తప్పుడు కేస్ లు పెట్టటం సిగ్గుపడాల్సిన పరిస్థితి.
ప్రైమ్9 యాజమాన్యం కేసులు పెట్టిన 4 గురికి కలిపి యాజమాన్యమే దాదాపుగా 12 లక్షల రూపాయల వరకు ఇవ్వాలి…ఇవ్వకుండా కోర్టు ద్వారా తప్పుడు కేసులు నమోదు చేశారు.ఒక సంస్థలో ఒక వ్యక్తి పని చేయడం మానుకోవడం అన్నవి వారిద్దరి ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి సంస్థ నుండి బయటకు వెళ్లినంత మాత్రాన ఇలా కేసులు పెట్టి వేధించడం పరువు బజారు కు ఈడ్చడం వంటి చర్యల్ని ప్రైమ్9 ఛానల్ చేపట్టింది.
ఇది ఒక రకంగా జర్నలిస్ట్ వ్యవస్థ ను ఆ సంస్థ సవాల్ చేయడమే.మన అస్థిత్వాన్ని ప్రశ్నించడమే..
సంస్థ లో మానేస్తే తప్పుడు కేసులు పెట్టి హైద్రాబాద్ చుట్టూ తిప్పి వేధించే ప్రయత్నాన్ని మనమంతా ఖండించకపోతే, ఈ సంస్థ పిచ్చి వ్యవహారాలు మరీ శృతిమించిపోతాయి.ఏపీ లో4 గురు రిపోర్టర్స్ పై మోపబడ్డ ఆరోపణలతో పాటు రిపోర్టర్ లను అడ్డం పెట్టుకొని ఆ సంస్థ సాగిస్తున్న ఆర్థిక దోపిడీ, స్థలాల కబ్జా లపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
సంస్థ ఇటీవల రాజమండ్రి లో నిర్వహించిన శివ పార్వతుల కల్యాణం పేరు చెప్పి జిల్లా లోని ప్రముఖ దేవాలయాల కార్యనిర్వాహక అధికారుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు అభియోగాలున్నాయి. తాము నిర్వహిస్తున్న ఈ కళ్యాణ కార్యక్రమానికి దేవాదాయ సంస్థ ద్వారా నిధులు సమకూర్చమని ఆ శాఖ కాకినాడ డిప్యూటీ కమిషనర్ పై ఒత్తిడి తెచ్చారు.
ఈ సంస్థ లో డైరెక్టర్ గా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి గతం లో పోలీసు శాఖ లో ఇంటలిజెన్స్ సి ఐ గా పని చేశానని చెపుతూ ప్రస్తుతం పలు చోట్ల పేకాట క్లబ్ లను నిర్వహిస్తూ వాటి జోలికి పోలీసులు రాకుండా తన రిపోర్టర్ ల ద్వారా ఒత్తిడి చేస్తూ రోజూ తన క్లబ్ ద్వారా వేల రూపాయలను సంపదిస్తూ పబ్లిక్ గా అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఛానల్ నిర్వాహకులు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గ్రామం లో గల శ్రీ విశ్వనాథ మఠానికి చెందిన ఆస్తుల్ని తన బండి ఫౌండేషన్ అనే చేతి సంచి సంస్థ పేరిట బదలాయించుకోవడం తో పాటు ఈ మఠానికి ఉన్న సుమారు 80 ఎకరాల భూమిలో 2 ఎకరాలను వ్యక్తిగతంగా ఆక్రమించి ఆ స్థలం లో రోడ్లు నిర్మించి ప్లాట్లు గా విక్రయానికి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మఠం లో ఒక దొంగ స్వామిజీ ని తెచ్చి పెట్టడం నాలుగు రోజుల క్రితం ఆ స్వామిజీ ఒక మహిళతో అసభ్యకర పరిస్థితిలో ప్రజలకు దొరికిపోవడం జరిగింది.
ఈ మఠం ఆస్తుల్ని తన సొంతం చేసుకునేందుకు ఈ సంస్థ యజమాని తన సిబ్బంది ద్వారా కాకినాడ లోని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పై ఒత్తిడి తెచ్చారు. ఆయనను కూడా ఈ వ్యవహారం లో అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఈ ఆక్రమణలకు అడ్డొస్తున్న మఠం పూర్వ ఉద్యోగి రామారావు ను ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఏలూరు కు బదిలీ చేయించారు.
ఇలా ప్రైమ్ 9 ఛానల్ పేరు చెప్పి ఇప్పటికే వందల కోట్ల విలువైన అక్రమాలకు ఈ సంస్థ తన రిపోర్టర్ లను వినియోగించుకొని పాల్పడిందన్న విమర్శలున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఎపియుడబ్ల్యుజె, గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేస్తోంది.
అలాగే తన ప్రయోజనాలు నెరవేర్చుకొని కూడా మరిన్ని డిమాండ్ లు పెట్టడం తో ఒత్తిడి తట్టుకోలేక సంస్థ నుండి మానేసిన సాంబశివరావు పై పెట్టిన అక్రమ కేసుల్ని ఈ సంస్థ యాజమాన్యం బే షరతు గా ఉపసంహరించుకోవాలి.లేని పక్షంలో సంస్థ ఆర్థిక అక్రమాలపై ప్రభుత్వం దర్యాప్తు కు అదేశించేవరకు యూనియన్ తరపున ఉద్యమిస్తాం. ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేస్తాం. ఈ పోరులో ఇతర జర్నలిస్ట్ సంఘాలు,కార్మిక ఉద్యోగ సంఘాలు కూడా కలసి రావాలని కోరుతున్నాం.
ప్రైమ్9 ఛానెల్ యాజమాన్య తీరుపై గుంటూరు జిల్లా ఏపియుడబ్ల్యూజె కమిటీ ఆగ్రహం
