ప్రత్యేక హోదా పాయె..విభజన హామీలు పాయె..రైల్వే జోన్ పాయె

అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
కేంద్ర తల వంచుతానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం ముందు తన మెడ వంచి నట్లు అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. ఫలితంగా ప్రత్యేక హోదా పాయె, పోలవరం నిధులు పోయె, విభజన హామీలు పాయె, రైల్వే జోన్ పాయె అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్లనే విభజన చట్టంలోని హామీలన్నీ ఒక్కొక్కటిగా బుట్టదాఖలా అయ్యాయని ఆరోపించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్ సాధించుకోస్తానని, తెలుగు దేశం ప్రభుత్వం విఫలమైందని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఎదుట చేతులు ఎత్తేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్లే విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, పోలవరం నిధులు ,విభజన హామీలు ,రైల్వే జోన్ ఇవన్నీ ఒక్కొక్కటిగా మాయమయ్యాయని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రజలు 22 ఎంపీ స్థానాలను వైకాపా ఇచ్చినా పార్లమెంటులో నిష్పయో జకులుగా మారాలని ఆరోపించారు. నూతన రాజధానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అడగటం లేదని, మూడు రాజధానుల మూడు ముక్కలాట లో రాజకీయం చేయటమే వైకాపా పనిగా మారిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు తోనూ, అమరావతి ఉద్యమకారులతో పోరాటం ఒక్కటే వైకాపాకి తెలిసిన పనిగా ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టిన చరిత్ర కూడా వైకాపాకే దక్కుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, రాష్ట్రప్రభుత్వ బలహీనతలను ఆసరా చేసుకొని విభజిత రాష్ట్రంపై వివక్ష చూపుతున్నట్లు బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply