సీఎం సొంత నియోజకవర్గంలోనే దారుణమైన అవినీతి

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఇసుక, అక్రమ మద్యం కాదేదీ అవినీతికి అనర్హం అంటూ జగన్ రెడ్డి గారు జనం డబ్బు దోచేస్తుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు ఆయన బంధువులు, పార్టీ నాయకులు. పులివెందులలో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్న ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు గుంజ

బోయాడు జగన్ రెడ్డి గారి సమీప బంధువు వైయస్ కొండారెడ్డి. సీఎం గారి సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణమైన అవినీతి జరుగుతుంటే రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదు చేయని దందాలు ఎన్ని జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజల్ని, వ్యాపారుల్ని, కాంట్రాక్టర్లని పీడిస్తున్న వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలి.

నిన్నటి సూసైడ్ నేటి రేప్ గా ఎలా మారింది జగన్ రెడ్డి ?
ముఖ్యమంత్రి గారూ! బి ఫార్మశీ స్టూడెంట్ తేజస్విని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం ముమ్మాటికీ మీ వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ ని తప్పించే ఎత్తుగడే. తమ బిడ్డని రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తే..పోస్ట్ మార్టం కాకుండానే ఆత్మహత్యగా డిఎస్పీ తేల్చేసింది మీ కళ్లల్లో ఆనందం కోసమేనని అర్థమవుతోంది. నిన్నటి సూసైడ్ నేటి రేప్ గా ఎలా మారింది జగన్ రెడ్డి గారు! ఇది యాగీ చేయడం కాదు. మీ బిడ్డలకో, మీ నేతల పిల్లలకో ఇదే అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తారా?

బీహార్ ని తలపించే విధంగా ఏపీలో గన్ కల్చర్
బీహార్ ని తలపించే విధంగా ఏపీలో గన్ కల్చర్ రావడం దురదృష్టకరం.నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెళ్లికి అంగీకరించలేదని బంగారు భవిష్యత్తు ఉన్న యువతిపై సురేష్ రెడ్డి కాల్పులు జరిపి చంపడం దారుణం. ఆడబిడ్డలపై పెరిగిపోతున్న ఈ అఘాయిత్యాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి.

Leave a Reply