ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు దారపునేని నరేంద్ర అరెస్టు

– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి

రాష్ట్రంలో అధికారపక్షాన్ని ప్రశ్నిస్తూ తమ గళాన్ని విన్పిస్తున్న తెలుగుదేశం పార్టీ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్రను అరెస్టు చేయడం ప్రతిపక్షం గొంతునొక్కే నొక్కడమే. 41ఎ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, గతంలో పలు కేసుల్లో హైకోర్టు చీవాట్లు పెట్టినా సిఐడి పోలీసులు మరోమారు నరేంద్ర విషయంలో అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరించారు.

తెలుగుదేశం మీడియా కోఆర్డినేటర్ పార్టీ వాయిస్ ను దీటుగా విన్పిస్తున్నారన్న కక్షతోనే నరేంద్రను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పెడచెవిన పెడుతూ సిఐడి వ్యవహరిస్తున్న తీరును తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. పోలీసు మ్యాన్యువల్ కు విరుద్దంగా నరేంద్రను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దారపునేని నరేంద్రకు ఏవిధమైన హాని జరిగినా సిఐడి పోలీసులదే బాధ్యత. సిఐడి పోలీసులు తమ తప్పు తెలుసుకొని నరేంద్రను బేషరతుగా విడుదల చేయాలి. నరేంద్రను తక్షణమే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం.

Leave a Reply