– బెంగళూరు ప్యాలెస్ లో ఉండి ప్రభుత్వంపై జగన్ బురదజల్లే ప్రయత్నాలు
– అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల కడుపుకొట్టిన దుర్మార్గుడు జగన్
మడకశిర : యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని ఈనెల 12న ప్రారంభించి, చెప్పిన మాట ప్రకారం తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేశారని, తల్లుల ముఖాలు ఆనందంతో నిండిపోయాయని మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు అన్నారు.
మడకశిరలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. తల్లికి వందనం పథకం ద్వారా తమ ఖాతాల్లో నగదు జమ కావడం పట్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ చేసిన దాఖలాలు లేవు.
ముఖ్యమంత్రి చంద్రబాబుగారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15వేలు తల్లికి వందనం ద్వారా అందించారు.
రాష్ట్రంలో మహిళలు ఆనందంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో ఉండి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రబాబుగారిని హేళన చేసే విధంగా నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అంటూ మాట్లాడిన జగన్…నేడు తల్లుల వద్దకు వెళ్లి రూ.15వేలు అందాయో, లేదో కనుక్కోవాలని డిమాండ్ చేస్తున్నాను.
జగన్ తన పాలనలో పెన్షన్ ను వెయ్యి రూపాయలు పెంచడానికి 5ఏళ్లు తీసుకుంటే…చంద్రబాబు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పెద్దఎత్తున పెన్షన్లు అందిస్తున్నారు. జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పేద కూలీల కడుపు నింపడం కోసం చంద్రబాబు పెట్టిన అన్నా క్యాంటీన్లను రద్దు చేసి, పేదవారి నోటివద్ద ముద్దను తీసేసిన దుర్మార్గుడు.