– నెల్లూరు నగర కార్పొరేషన్ లో మెప్మా మహిళలకు ట్యాబ్స్ పంపిణీ
– డిజిటల్ సేవలపై అవగాహన కల్పించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు
నెల్లూరు: నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం మెప్మా మహిళలు, ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు సీటీ పరిధిలోని 160 మంది మెప్మా రిసోర్స్ పెర్సన్స్ కు ట్యాబ్ లను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. డిజిటల్ సేవలపై మెప్మా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చి పనితీరుని మెరుగుపరిచేందుకు ట్యాబ్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మెప్మా మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. వారందరినీ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం సంకల్పం అన్నారు.
28 లక్షల డ్వాక్రా మహిళల సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో ఇసుక నిర్వహణ కూడా డ్వాక్రా మహిళలకే అప్పగించారని గుర్తు చేశారు. 175 నియోజక వర్గాల్లో ఎమ్మెస్ ఎంఇలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఖ్వాటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు కాబోతోందన్నారు. రాష్ట్రాన్ని డిజిటల్ ఆంద్రప్రదేశ్ చేయాలన్నది సీఎం కల అని ఘంటాపధంగా తెలిపారు.
రాష్ట్రంలో 60 డీజీ లక్ష్మీ సెంటర్ లు సేవలు అందిస్తున్నాయన్నారు. యువనేత లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రిసోర్స్ పెర్సన్స్ కి 9000 వేల ట్యాబ్ లూ పంపిణీ చేస్తున్నామన్నారు. ట్యాబ్ ని వాడితే నాలెడ్జి కూడా పెరుగుతుందని చెప్పారు. సెల్ ఫోన్ వాడినంత సులభంగా ట్యాబ్ ని వినియోగించవచ్చన్నారు. స్మార్ట్ స్త్రీట్స్ పెడుతున్నామని తెలిపారు. నెల్లూరులో వెయ్యి మంది మెప్మా మహిళలను వ్యాపారవేత్తలను చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ , మెప్మా ఏఎంఢీ వెంకటేశ్వర్లు , ఎస్ఎంఎం శ్రీనివాసులు , మెప్మా పీడీ లీలా రాణి , టిట్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి , కమిషనర్ నందన్ , టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు.