ఆరడుగులకు కొంచెం
తక్కువే కాని..
నిజంగా
ధైర్యం విసిరిన రాకెట్టే..
నమ్మిన సిద్ధాంతం కోసం
అన్నతోనే
విబేధించిన నైజం..
కుండబద్దలు కొట్టి నిజం..
తానుగా రాసుకున్న కమ్యూనిజం..
అదే..అదే..పవనిజం..!
రాజకీయమంటే ఎన్నికలా..
ప్రజలకు తాననుకున్నది చెయ్యాలన్న కలా..?
అడిగితే ఛాయిస్
గంభీరంగా పలికే
పవన్ వాయిస్..
రెండోదానికే ఎస్..
నమ్మిన సిద్ధాంతం కోసం
ఎంతటి రాద్ధాంతానికైనా
ఓ ఎస్!!
రాజకీయం ఎలా చెయ్యాలో నేనేం పుస్తకం రాసానా..
అంటూ ముందుకు పోయే
ఈ జనసేన సిద్ధుడు..
అప్పుడప్పుడూ
ధర్మప్రబోధాలు చేసే బుద్ధుడు..!
అన్నంటే ప్రాణం
ఇచ్చే తమ్ముడు..
తొలిప్రేమ మాత్రం తనంటే
పడిచచ్చే ఫాన్సే..
వాళ్లకి ఇతడు ప్రిన్సే!
కోటు తొడిగి వాదించగలను
ఆ కోటు విప్పి
కొట్టగలను అన్నట్టు..
సభల్లో లాల్చీ పంచె కట్టి ప్రసంగాలతో పంచనామా..
జనంలోకొచ్చి అదే లాల్చీ పైజామాతో హంగామా..
అన్యాయం జరిగితే
బాధ్యులను నిలబెట్టు..
అంతకు ముందుగా
అన్యాయానికి గురైన
బాధితుల మధ్య నిలబడు..
అవసరమైతే కలబడు..!
అదే పవన్ బడి..
అభిమానుల హృదయమే
ఆయన గుడి..
వారి అభిమానమే రాబడి..!
అధికారం వచ్చినా రాకపోయినా
జనంతో తను..
తనతో జనం..
అదే పవన్ మార్క్సిజం..
ఆయన మార్కు ఇజం!
ఖుషీ గా బెంగాల్ టైగర్
సిద్దు సిద్దార్థరాయ్..
తప్పు చేస్తే ఎంతటివారైనా
నిలదీసి ఉతికి ఆరెయ్..
కెమెరామన్ గంగతో రాంబాబు..
సహించనే సహించడు
అధికారపక్షాల రుబాబు..
బాలు డిగా ఎబిసిడిఇ మాత్రమే..
నాయకుడిగా జనమే
ఎ టు జెడ్..
అప్పుడప్పుడు అజ్ఞాతవాసి
ఎప్పుడూ జనహృదయ స్థిరనివాసి..
అవతల ఎంత ఖల్నాయకైనా
తగ్గేది లేదీ భీమ్లానాయక్!
మొదట్లో కేరాఫ్ అన్నయ్య
ఇప్పుడేమో పవరాఫ్ జనమయ్య!
హాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286